పుట:Prasarapramukulu022372mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

13

రూపకల్పనకు కృషి చేశారు. ఈ కేంద్రం జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతు లందుకొంది.

హాస్యబ్రహ్మ మునిమాణిక్యం నరసింహారావు, నాయని సుబ్బారావు, న్యాపతి రాఘవరావు, కామేశ్వరి (రేడియో అన్నయ్య, అక్కయ్యగా ప్రసిద్ధులు) ఈ హైదరాబాదు కేంద్రం ప్రశస్తికి తోడ్పడ్డారు.

దూరదర్శన్ హైదరాబాదు నుండి ప్రసారాలు మొదలుపెట్టిన తర్వాత ఈ కేంద్రం నుండి చాలామంది ప్రసార ప్రముఖులు అందులోకి బదిలీ అయ్యారు. రామంతపురంలో సువిశాలమైన స్టూడియోలతో దూరదర్శన్ తన ప్రసారాలను ఆంధ్ర ప్రేక్షకులకు అందిస్తోంది. భద్రవ్రత, బాలకృష్ణ, నండూరి విఠల్, G. మరార్ ఈ కేంద్రంలో పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం శ్రోతల విభాగం పరిశోధనాధికారులుగా వ్యవహరించిన శ్రీ B. S. S. రావు, H. హనుమంతరావు ప్రసారాల నాణ్యతకు కృషి చేశారు. B. S. S. రావు SITE కార్యక్రమాల తొలిరోజుల్లో విశేషంగా కృషి చేశారు. తర్వాత వారు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో Information Director గా పనిచేసి తర్వాత UGC వారి హైదరాబాదు విద్యా ప్రసార కేంద్రం డైరక్టర్ అయ్యారు. హనుమంతరావుగారు హైదరాబాదులో Audience Research గా పనిచేసి పదోన్నతిపై డిప్యూటీ డైరక్టరుగా బొంబాయి వివిధ భారతిలో పని చేశారు. మలేషియాలోని Asian Institute of Broadcast Development సంస్థలో మూడు సంవత్సరాలు డిప్యూటీ డైరక్టరుగా వ్యవహరించారు. హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో Information డైరెక్టరుగా 1995 లో చేరడానికి ముందు వారు ఆకాశవాణి ఆడియన్స్ రీసర్చ్ డిప్యూటీ డైరక్టరుగా అలహాబాదులో పనిచేశారు. కార్యక్రమాల రూపకల్పనపట్ల చక్కటి అవగాహన, విశ్లేషణ గల వారిలో హనుమంతరావుగారు ఒకరు.

త్రిపురనేని గోపీచంద్ (1910-62) :

గోపీచంద్ కథకుడు, నవలా రచయిత, సాహితీవేత్త.

1910 సెప్టెంబరు 8న కృష్ణాజిల్లా అంగలూరులో జన్మించారు. గుంటూరులో బి.ఏ. పూర్తిచేసి. మదరాసులో బి.యల్. చదివారు. ఆంధ్రదేశంలో రాడికల్ ప్రజాస్వామ్య పార్టీ కార్యదర్శిగా పనిచేశారు.