పుట:Prasarapramukulu022372mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

3

రెడ్డిని ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు. అనంతరం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. 186 నెలలు వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.

సాహితీ రంగంలో ఆయన సవ్యసాచి. 1946 నుండి తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1957 నుండి 82 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సం॥లు పనిచేశారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్నానపీఠ అధ్యక్షులు. ఆయనకు పరిచితులుకాని సాహితీకారులు లేరు. అనేక భాషలలో సన్నిహిత పరిచయం గల గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభమై డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. ఆమె, ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె చెరుకులు. ఇలా ఆమె పంచకం వెలువడింది.

కవితారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న డా. గోపాలరెడ్డి వార్ధక్యాన్ని సాహితీ సుగంధాలతో నింపుకుని శేష జీవితాన్ని నెల్లూరులో గడుపుతున్నారు.

పర్వతనేని ఉపేంద్ర జనతా ప్రభుత్వంలో V.P. సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా కేంద్ర సమాచార ప్రచార మంత్రిగా 1988లో బాధ్యతలు స్వీకరించారు. ఉపేంద్ర ఎం.ఏ. పట్టభద్రులై రైల్వే మంత్రిత్వ శాఖలో పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో పనిచేశారు. కొంతకాలం మధు దండావతే రైల్వే మంత్రిగా మనిచేస్తున్న కాలంలో వారి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ 1983 లో ఏర్పడినపుడు దాని రూపురేఖలు తీర్చిదిద్దడంలో N.T. రామారావుకు తోడ్పడారు. 1984లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉపేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ లో దూరదర్శన్ విస్తరణ బాగా జరిగింది. విజయవాడ దూరదర్శన్ కేంద్రం P.G.F. స్టుడియోల నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. విజయవాడ నుండి 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మల్లికార్జున్ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించారు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిత్వంలో ఆయన కొంతకాలం 1983-84