పుట:Prasarapramukulu022372mbp.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

ప్రసార ప్రముఖులు.

మధ్య సమాచార శాఖను నిర్వహించారు. తెలంగాణా ఉద్యమ కాలంలో విద్యార్థి నాయకుడుగా, చెన్నారెడ్డి అనుచరుడుగా మల్లికార్జున్ రాజకీయాలలో పాల్గొన్నారు. తెలంగాణా పోరాట సమితి పక్షాన లోక్‌సభకు ఎన్నికయ్యారు. రక్షణశాఖ స్టేట్ మంత్రిగా పనిచేశారు. పార్లమెంటరీ వ్యవహారాలతో పాటు అనేక శాఖలు సమర్ధవంతంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ 1996లో కూడా విజయం సాధించారు.

నెహ్రూగారి మంత్రిత్వంలో శ్రీ C. R. పట్టాభిరామన్ సహాయమంత్రిగా ప్రసార మంత్రిత్వ శాఖను పటేల్ గారి నాయకత్వంలో నిర్వహించారు. వీరు మేమూ తెలుగువారమని చెప్పుకొనేవారు. పట్టాభిరామన్ తిరువాన్కూర్ దివాన్ గా పనిచేసిన సర్ సి.పి. రామస్వామి అయ్యర్ కుమారులు.

ప్రసార మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు ఎందరో పదవీ బాధ్యతలు నిర్వహించారు. వారిలో ప్రధానులు శ్రీ. ఏ.యు. శర్మ, శ్రీ కె. యస్. శర్మ, I.A.S.కు చెందిన వీరిద్దరు Joint Secretary (Broadcasting)లుగా వ్యవహరించారు. ఏ.ఉమాకాంతశర్మ బీహారు క్యాడర్ కు చెందిన సీనియర్ I.A.S. అధికారి. జనతా ప్రభుత్వ హయాంలో వీరు జాయింట్ సెక్రటరీగా ఒక సంవత్సరం పనిచేశారు. ఢిల్లీలో డిప్యుటేషన్ పూర్తికాగానే పాట్నాకు బదలి అయి బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పదవీ విరమణానంతరం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. శర్మగారికి సోషలిష్టు భావా లున్నాయి. వీరిది కడపజిల్లా నందలూరు స్వగ్రామం.

శ్రీ. కె. సుబ్రహ్మణ్యశర్మ ఆంధ్రా క్యాడర్ కు చెందిన 1968 బ్యాచ్ I.A.S. అధికారి. M.Sc. పట్టభద్రులైన శర్మ అనంతపురం, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. లండన్ లో ఒక సంవత్సరకాలం శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన శర్మగారు 1996లో ప్రసార మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ (Broad Casting)గా నియమితులయ్యారు. వీరిని పి.వి. ప్రభుత్వం 1996 లో దూరదర్శన్ డైరక్టర్ జనరల్ గా నియమించింది. శర్మగారు గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యులు. 1944 జూలైలో జన్మించారు. 1968 జూలైలో I.A.S.లో చేరారు. కొంతకాలం ఆంధ్రరాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.