పుట:Prasarapramukulu022372mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార మంత్రిత్వశాఖ

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఎందరో ప్రముఖులు నేతృత్వం నిర్వహించారు. మొట్టమొదటిగా పేర్కొనదగిన తాళ?? ప్రాంశులైన వ్యక్తి డా. బెజవాడ గోపాలరెడ్డి. రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా, శాంతి నికేతన్ సాహచర్యంతో ఎదిగిన వ్యక్తి గోపాలరెడ్డి. బహుభాషా పరిచయం వారి ప్రత్యేకత. రాజకీయ భీష్ములుగ స్వాతంత్రోద్యమ సమరంలో పనిచేసిన గోపాలరెడ్డి అతి చిన్న వయసులో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు.

డా. బెజవాడ గోపాలరెడ్డి

జవహర్ లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో 1962-64 మధ్య కాలంలో సమాచార ప్రసారమంత్రిగా వ్యవహరించారు. విశాఖపట్టణ కేంద్రం (ఆగష్టు 4, 1963), కడప కేంద్రం (జూన్ 17, 1963) ప్రారంభోత్సవాలు వీరి చేతిమీదుగా జరిగాయి. కామరాజ్ ప్లాన్ క్రింద గోపాలరెడ్డి 64లో మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. గోపాలరెడ్డి సాహితీవేత్త.

సాహితీ రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని 90 సంవత్సరాల నిండు జీవితాన్ని పరిపూర్ణారోగ్యంతో గడిపిన పూర్ణపురుషుడు బెజవాడ గోపాలరెడ్డి. ఈ శతాబ్ది ప్రథమంలో జన్మించి చివరి వరకు జరిగిన పరిణామాలు అన్నిటినీ దర్శించిన భవ్యపురుషుడు.

1907 ఆగష్టు 5న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో గోపాలరెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసానంతరం బందరు జాతీయ కళాశాలలో చేరారు. అక్కడ నుండి శాంతి నికేతన్ లో 1924-27 సం॥ లలో రవీంద్ర కవీంద్రుని అంతే వాసి అయ్యారు. ఒక వైపు జాతీయోద్యమం మరోవైపు సాహిత్యపిపాస గోపాలరెడ్డి జీవనంలో పెనవేసుకొన్నాయి.

జాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను మంత్రిగా వివాహమాడారు. కర్నూలులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా గోపాల