పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

ప్రపంచ చరిత్ర

కొన్నట్లు చెప్పుతారు. అతనికింద ఒక హిందువుల సైన్యం వుండేది. ఆ హిందూ సైన్యానికి ఆధిపతి తిలక్ అనే పేరుకలవాడు. మహమ్మదు తిలక్ నూ, అతని సైన్యమునూ గజనీ తీసుకువెళ్ళి, తిరుగుబాటు చేసిన ముస్లిములను అణచివేశాడు. దీనినిబట్టి మహమ్మదులక్ష్యము విజయమే నని నీవు గ్రహించగలపు. ఇండియాలో ముస్లిము సైనికుల సహాయంతో విగ్రహారాధకులను చంపడాని కతడు సిద్ధపడ్డాడు. మధ్య ఆసియాలో హిందూ సైనికుల సహాయంతో అతడు ముస్లిములను చంపడానికి సిద్ధ పడ్డాడు. ఇస్లాము ఇండియాను వూపివేసింది. అభివృద్ధిలో పూర్తిగా వెనకబడుతున్న సంఘములో వీర్యమునూ, వృద్ధిని పొందవలెననే ఇచ్ఛను అది ప్రవేశ పెట్టింది. హిందూకళ క్షీణదశలో వుంది. పునరుక్తితో అనవసరపు వివరములతో అది అలవిగాకుండా వున్నది. ఈ కళ ఉత్త రాదిని ముస్లిము సంపర్కమువల్ల మార్పు చెందింది. కొత్తకళ వృద్ధిలోకి వచ్చింది. దానిని హిందూ-ముస్లిము కళ అనవచ్చు ననుకుంటాను. అది వీర్యవంతంగా, శక్తిపరంగా వున్నది. ముస్లిములు కొత్తగా తెచ్చి పెట్టిన నూతనాభిప్రాయములు కారణముగా ప్రాచీన హిందూస్థాన భవననిర్మాణ కుళలులు కొత్త ఆవేశమును పొందిరి. ముస్లిముమతమూ. జీవిత సమస్యల గూర్చిన వారి పూహలూ ఆనాటి వాస్తు పద్ధతిలో మార్పులు ప్రవేశ పెట్టేను. సరళమైన, ఉదారమైన చిత్రకల్పనకు వారు తిరిగి పచ్చిరి. ముస్లిం దండయాత్ర మొదటిఫలితము ప్రజలు దక్షిణానికి తరలి పోపడము. మహమ్మదు దండయాత్రలు, హత్యలూ కారణముగా ఉత్తరహిందూస్థానములో ఇస్లాము కిరాత క్రౌర్యమునకూ , వినాశమునకూ పెట్టినది పేరని ఊహించమొదలు పెట్టారు. కాబట్టి సూతన దండయాత్ర వచ్చినప్పుడు, దానినెవరూ ఆపలేక పోయినప్పుడు, నిపుణులగు