పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

ఇండియా మీద ఆఫ్ఘనుల దండయాత్ర

మొట్టమొదట ఈ మస్లిములు భయంకరముగా, క్రూరముగా పుండేవారు. వారు కర్కశ దేశమునుండి వచ్చారు. మర్దవమంటే అక్కడ అట్టే మెచ్చుకోరు. ఇంతేకాదు, వారు తాము జయించిన కొత్త దేశంలో పుండిరి. వారి చుట్టుపట్ల వారందరూ వారికి శత్రువులే. పోరు ఏక్షణంలోనైనా తిరుగబడవచ్చును. తిరుగబడుదురనను భయము నిత్యమూ వుండెను. అట్టి భయమే క్రూరత్వానికీ, భయంకత్వానికి బీజము , ప్రజలను భీతావహులనుజేసి అణచి పెట్టడానికి హత్యలు జరుగుతుండేవి. మతము వేరుచెప్పి ఒక హిందుపును ఒక ముస్లిము చంపడంకాదిది. పరదేశి ఒకడు దేశమును జయించి అచ్చటి ప్రజలను బెదిరించి అణచి పెట్టుటకు చేసిన హత్యలివి. ఈ క్రూరకృత్యాలను మతా నికి ముడి పెట్టడం సర్వసామాన్యంగా జరుగుతోంది. కాని ఆడిసత్యం కాదు. ఒక్కొక్కప్పుడు మతాన్ని సాకుగా పెట్టుకోవడం కద్దుకాని నిజమైన కారణాలు రాజకీయ మైనవీ, సాంఘిక మైనవీ. ఇండియాపై దండెత్తిన మధ్యఆసియా ప్రజలు స్వదేశంలో కూడా క్రూరులే. ఇస్లాం ముతము పుచ్చుకోవడానికి ముందునుంచీ వార్ట్లాంటివారే. ఒక దేశము నూతనుముగా జయించి దానిని అదుపుఆజ్ఞంలో పెట్టుకోడానికి ఒక్కటే మార్గం వారెరుగుదురు. అది ప్రజలతో భీతి పట్టించడమే, క్రమేణా ఇండియా ఈ భయంకరయోధులను సాదుచేసి వారిని నాగరీకులనుగా చెయ్యడం మొదలు పెట్టింది. క్రమేణా వారుజయేచ్ఛతో పందేశమునుంచి వచ్చినవారుగా భావించుకోక భారతీయులుగానే భావించు కొన మొదలు పెట్టారు. కొత్త దేశంలోని పిల్లలను పెండ్లి చేసుకొన్నారు. విజేత , విజితుడు అనే భేదం క్రమంగా తగ్గిపోయింది. ఈ సందర్భంలో చిత్రమైన ఒక విషయం చెప్పుతాను. గజినీ మహస్ముడు ఉత్తర హిందూస్థానముకు తెలిసిన విధ్వంసకులలో మేటి. విగ్రహారాధకులను శిక్షించడానికి, ఇస్లాంను రక్షించటానికి అతను ఫూను