పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ప్రపంచ చరిత్ర

లర్పించుకోవలసివచ్చింది. ప్రబలుడైన రాజుతో శత్రుత్వం వచ్చింది. అన్య దేశీయుడు దండెత్తివచ్చి ఇతనిని ఓడించడం సులభమైంది. ఈవిధముగా క్రీ. పె. 1192 లో సహబ్-ఉద్- మొట్ట మొదటి విజయమును పొందాడు. దీనికి ఫలితము ఇండియాలో ముస్లిము పరి పాలన స్థాపించబడడం. మెల్ల మెల్లగా తూర్పుగాను, దక్షిణముగాను ఆఫ్ఘనులు వ్యాపించారు. మరి 150 ఏండ్లలో (1840 సంప్సరానికి) ముస్లిమ్ పరిపాలన దక్షిణమున చాలా భాగము పై వ్యాపించింది. పిమ్మట దక్షిణమున అది తగ్గు మొహము పట్టింది. కొత్త రాజ్యములు తలయెత్తి నవి. అందు కొన్ని ముస్లిమ్ రాజ్యములు, కొన్ని హిందూరాజ్యములు, అందు ముఖ్యముగా విజయనగర హిందూసౌమ్రాజ్యము పేర్కొనదగి నది. 200 సంవత్సరములకాలము కొంతవరకు ఇస్లాము ఉన్నతిలో లేదు. 16 వ శతాబ్దపు మధ్యమందు అక్బరు తలయెత్తినప్పుడు మళ్ళీ ఇస్లాము సుమారు ఇండియా అంతటను వ్యాపించింది. దండయాత్రలుచేస్తూ ముస్లిములు ఇండియాకు రాపడంవల్ల అనేక ఫలితాలు కలిగాయి. దండయాత్రలు చేసినవాళ్ళు ఆఫ్ఘనులు అనే మాట మరవకు. అరబ్బులు నూకారు, పయనులుసూ కారు, పడమటి ఆసి యాలో మంచి నాగరికత సందిన ముస్లిములు నూకారు పచ్చినది. నాగరికతను బట్టి చూస్తే ఈఆఫ్ఘనులు, హిందూ దేశస్థులకన్న వెనుకబడివుండిరి . కాని వారు చురుకుగా వుండిరి . అప్పటి ఇండియాలోని ప్రజలకంటే ఎక్కువ శక్తితో వుండిరి. ఇండియా పాత మార్గాల్లో చిక్కుకొనిపోయి పున్నది. అది ముందుకు పోవడంలేదు. మారడంలేదు. పాత పద్ధతులను గట్టిగా పట్టుకున్నదేగాని ఆపద్ధతులను బాగుచెయ్యడానికి ప్రయత్నించడం లేదు, యుద్ధ పద్ధతులలో కూడా ఇండియా వెనుకబడివుండెను. ఇంతకన్న ఆఫ్ఘనులు కట్టుదిట్టంగా పుండిరి, కాబట్టి యెంతటి ధైర్యసాహసా లున్నా ముస్లిము దండయాత్రకు ఇండియా తలయొగ్గవలసి వచ్చింది.