పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇండి యామీద ఆఫ్ఘనుల దండయాత్ర

63

మూర్పుగాని, శాశ్వతమైన మార్పుగాని ఏమీరాలేదు. దేశానికి అనగా ముఖ్యంగా ఉత్తరాదికి ఒక పెద్ద దెబ్బతగిలినట్లయింది. చక్కని సౌధ ములను, భపములను అనేకము అతడు నాశనం చేశాడు. కానీ సింధు దేశమూ, పంజాబుతో కొంతభాగము హత్రమే గజినీ సామ్రాజ్యంలో నిలిచాయి. ఉత్తరహిందూ స్థానముతో మిగతాధాగాలు త్వరలో తేరు కున్నాయి. దక్షిణాదికి ఎట్టి యిబ్బందికలుగలేదు. బెంగాలూ అంతే. మహమ్మదు అనంతరం 150 సంవత్సరములుపైగా గా ముస్లింవిజయములు గాని. ఇస్లాం మతముగాని ఇండియాలోఎట్టి విధముగానూ ముందుకు పోలేదు. 12 వ శతాబ్ది చివరి భాగములో (సుమారు 1186 క్రీ. వె.) వాయవ్యము నుంచి నూతన దండయాత్రల యాత్రా పరంపరలు వచ్చాయి. ఆఫ్ఘని స్థానములో ఒక సోయకుడు తలయెత్తి , గజనీని స్వాధీనము చేసుకొని గజినవై టు సామ్రాజ్యాన్ని తుద ముట్టించాడు. అతని పేరు నవాబ్ -ఉద్- దీన్ ఘోరి (ఘార్ ఆఫ్ఘనిస్థానములో చిన్న పట్టణము). అతడు లాహోరుకు దిగివచ్చి, దానిని స్వాధీనము చేసుకొని ఢిల్లీ పై దండ యాత్ర సాగించాడు. రాజు పృధ్వీరాజు చౌహాన్. ఉత్తమ హిందూ స్థానాధీశులు అనేకులు అతనితో చేరారు. సృధ్వీరాజు నాయకత్వాన్ని వారు సహబ్ -ఉద్ -దీన్ ను ఎదుర్కొని అతనిని పూర్తిగా ఓడించారు. మరుసటి సంవత్సరం సహబ్ -ఉద్ -దీన్ పెద్ద సైన్యమును కూర్చుకొని తిరిగివచ్చాడు. ఈ మారతడు పృథ్వీరాజును ఓడించి అతనిని చంపాడు,

పృథ్వీరాజును గురించి ప్రజాసామాన్యము నేడు కూడా కథలుగా చెప్పుకుంటున్నారు. పాటలుకట్టి పాడుతున్నారు. ఈ పదాలలో ముఖ్య మైనది--అతదు కనోజిరాజైన జయచంద్రుని కూతురును యెత్తుకు పోయి పెళ్ళిచేసుకోడానికి సంబంధించినది. ఇందువల్ల అతనికి చాలా సష్టం కలిగింది. తన యనుచరులతో యోధులన్నవాళ్ళందరూ ప్రాణా