పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రపంచ చరిత్ర.

32


అమ్మతోటీ దిద్దాజ్ (ఇందిరమామ్మ) తోటీ నెలవరకూ నేను సంభాషణ చేయకూడదని. ఎందుకో నాతో చెప్పలేదు. బందీకి ఎందుకు చెప్పాలి ? నా తో సంభాషణ చేసేరోజు ఎప్పుడు వస్తుందా అని పది రోజులబట్టి వాళ్ళు డెహ్రాడూలుతో కనిపెట్టుకునవున్నారు. ఇదంతా వ్యర్ధమైనది . వాళ్ళు మళ్ళీ తిరిగిపోవలసించే. ఇది కానీ మాకు చూపే మర్యాద. కానీ, కానీ మనము లెక్క పెట్టకూడదు. రోటిలో తలపెట్టి రోకలిపోటురు భయపడడమెందుకు ? ఇంతకీ చెరసాల చెరసాలే , ఈసంగతి మనం మరచిపోకూడదు.

ఈ అన్యాయం జరిగిన వర్తమానాన్ని వదలి భూత కాలా నికి వెళ్ళడం నాకు సాధ్యంకాలేదు. రాత్రి నిద్రపోయాను కాబట్టి ఈ రోజు కొంచెం నయంగావుంది. మళ్ళీ ప్రారంభిస్తున్నాను.

మనప్పుడు మళ్ళీ ఇండియాకు పద్దాం . చాలాకాలమైంది దానిని వదలిపెట్టి వెళ్ళి, మధ్యయుగాల అంధకారంలోంచి బయటపడ్డానికి యూరో కొట్టుకొంటూన్న సమయంలో ఇండియాలో ఏమి జరుగు తోంది? ప్యూడల్ పద్ధతి బరువురించనూ, అచ్చటి దుష్పరిపాలన వల్లనూ, అల్లరులవల్లనూ ప్రజలు బాధపడుతున్నప్పుడు న్నప్పుడూ పోతా, చక్రవర్తి ఒకరితో ఒకరు పెనుగులాగుకొంటున్నప్పుడు , యూరోపులో దేశములు ఒకరూపానికి వస్తూన్నప్పుడూ. క్రూసేడులకాలమున క్రైస్తవమూ. ఇస్లామూ పరస్పరరోన్నతికోసం పోరాడుతున్నప్పుడూ ఇండియాలో ఏమి జరుగుతున్నది

మధ్యయుగముల తొలిరోజులతో ఇండియా యెట్లా వుండేదో కొద్దిగా చూచాము . వాయవ్య దిశనున్న గజినీ రాజ్యమునుంచి సుల్తాను మహమ్మదు భాగ్యవంతమైన ఉత్తరహిందూస్థాన మైదానములమీదికి వచ్చిపడి, దోడుకుని, నాశనం చెయ్యడం మనము చూచాము . మహమ్మదు దండయాత్ర ఘోరమైనవేకాని వాటివల్ల ఇండియాలో గొప్ప