పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యూరోపియన్ నగరములు తలయెత్తుట 20 తోడనే వాటికి ధైర్యమువచ్చును. కులీసులతో అవి యుద్ధమునకు దిగును. చక్రవర్తి ఒక్కొక్కసారి వాటిని ప్రోత్సహించును, ప్రబలు లగు కులీనుల నణగదొక్కవలెనని యాతడు కోరుట యిందుకు కారణము. ఈనగరములు పెద్దవర్తక సంఘములను ఆత్మరక్షణ సంఘ ములను స్థాపించుకొనెను. ఒక్కొక్క సూరు ఈ సంఘములు (వీటిని కాంఫిడెరసీలు అనెడివారు) కులీనుల ప్రతిసంఘములతో యుద్ధము చేయుచుండెను. హాంబర్గు, బ్రెమెన్ , కొలోస్ , ఫ్రాంక్ ఫర్డు, మ్యూనిచ్ , డాంజిన్, నూ రెంబర్గు, బ్రెస్లా-ఇవి కొన్ని వృద్ధి సందుచున్న నగరములు. నెదర్లాండులలో (నేడు వీటిని హాలెండు, బెల్జియము అందురు.) ఆంట్ పర్పు. బ్రూజెస్, మెంట్ అను సగరములుండెను. ఇవి పర్తక నగరములు, ఇందు వ్యాపారము నానాటికీ అతిశయించుచుండెను. ఇం గ్లాండులో లండనుండెను. కాని అప్పుడు యూరోపునందున్న ఇతర ముఖ్యనగరములతో పరిచూణమునందుగాని, థాగ్యమునందుగాని వర్తక ముందుగాని అది సరిపోలకుండెను. ఆక్సఫర్చు, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ములు రెండును విద్యానిలయములుగా ప్రాముఖ్యమును గదించుకొను చున్నవి. యూరోపుకు తూర్పున వియన్నా నగర ముండెను. యూరో పులో అది కడు ప్రాచీన నగరము, రష్యాలో సూస్కో, కీప్ , నొవోగో రాద్ నగరములుండెను. ఈ నూత నసగరములకును లేదా ఇందులో పెక్కునగరముల కును ప్రాచీన సాస్రూజ్యనగరములకునూ భేదమును మనము గమనించ యూరోపులో క్రొత్తగా తలయెత్తుచున్న సగరములకు ప్రాముఖ్యము ఒక రాజు సుబట్టికాని చక్రవర్తినిబట్టికాని వచ్చినదికాదు. అది వారివళమందున్న వర్తకమునుబట్టి వచ్చినది. కులీనులవల్ల వీటికి బలము చేకూరలేదు. వర్తకజనులపల్ల నే దానికి బలమువచ్చినది. అవి వర్తకనగరములు. ఈనగణములు తలయెత్తుట, బూరువాణి (మధ్యతర వలెను.