పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 స్రపంచ చరిత్ర వర్తకమువచ్చెను. దానితో ఆది నౌకాదళముసునిర్మించి సముద్రాధికార మును సంపాదించెను. ఆది భాగ్యవంతుల ప్రజాప్రభుత్వము (republic). దాని అధ్యక్షునకు దోజ్ అని పేరు. 1797 సంవత్సరపున నెపోలియన్ వెనీసును జయించువరకునది ప్రజాప్రభుత్వరాజ్యముగానే ఉండెను. అప్పుడు మిక్కిలివృద్ధుడగు డోజ్ పరాజయవార్తవిని ప్రాణములు విడిచిపడిపోయెనని చెప్పుదురు. అతడే వెనీస్ యొక్క ఆఖరిడోజ్ . ఇటలీ కావలితట్టున జినోవా పున్నది. అదికూడ సముద్రములో తిరుగు ప్రజలతో నిండిన ఒక గొప్ప వ్వాపారనగర మే. అది వెనీసుతో స్పర్థ జరుపుచుండెను. ఈ రెంటికి నిపుధ్య డొలోస్ విశ్వవిద్యాలయ ముండెను, పీజా, వెరోనా, ఫ్లోరెంసు పట్టణములుండెను. ఈ ఫ్లారెంసు నగరముననే ప్రఖ్యాతులగు చిత్రకారులు పలువురు తలయే త్తనున్నాడు. ప్రసిద్ధ " మేడిచి " కుటుంబము పరిపాలసక్రింద అది తేజోవంతముగా వెలుగనున్నది. ఉత్తర ఇటలీలోని మిలాణ నగరము అప్పుడే ఒక ముఖ్య కేంద్రమై యుండెను. దక్షిణమున నేపుల్సు అభివృద్ధి సంచుచుండెను. ఫ్రాంసుతో " జ్యూకే పెట్ పాలిసన్ను తనరాజధానిగా చేసి కొనెను. ఫ్రాంసు అభివృద్ధితో నదియును అభివృద్ధి నందుచుండెను. ఎల్లకాలములందును పాలిస్ ఫ్రాంసు దేశముయొక్క నాడీ కేంద్రమును, హృదయమునై యుండెను. ఇతరదేశముల రాజధానులుండెనుగాని అందొక్కటియు, కడచిన 1000 సంవత్సరములలోనూ తమదేశము ఆరో ఫ్రాంసులో పారిస్ సంపాదించినంత ప్రాబల్యమును సంపాదించ లేదు. ప్రాంసులో ప్రసిద్ధిసందిన ఇతరపట్టణఘులు లయన్సు, సర్సైలు, (ఇది ప్రాచీన రేవుపట్టణము), ఆర్లి యన్సు, జోర్డా, బొలోస్, ఇటలీలోవలెనే జర్మనీలోకూడ స్వతంత్ర నగముల అభివృద్ధి ముఖ్యముగా 18, 14 శతాబ్దులలో అధికముగా నుండెను. సంఖ్యవృద్ధియగుచూ, వాటి ప్రాబల్యమూ, భాగ్యమూ అతిగ యించిన