పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యూరోపియన్ నగరములు తలయెత్తుట 27 తీరముచుట్టును పెద్ద పట్టణములుండెను. రోముపతనము, గ్రీకు --- పోషక నాగరికత పతనము కారణముగా ఈపట్టణములును క్షీణించెను. కాంస్టాంటినోపులువినా యూరోపులో పెద్ద నగర మేలేదు. స్పెయినురో మూత్రమట్లుకోదు. అచ్చట అరబ్బులేలుచుండిరి. ఆసియాలో-ఇండియా చినా, ఆరబ్బీలోకములలో- ఈకాలమున గొప్పనగరములు వర్ధిల్లెను. కానీ యూరోపులోలేవు. నగరములతో పాటు సంస్కృతియు నాగరి కతయు పోపుచుండుననితోచును. యూరోపులో రోమక ప్రభుత్వము కూలినపిస్ముట దీర్ఘ కాలమువరకు ఇవిలేపు. కాని చురల సగరజీవనము పునరుజ్జీవితమయ్యెను. ముఖ్యముగా ఇటలీలో ఈసగరములు వృద్ధినందెను. పవిత్ర రోమక సామ్రాజ్య చక్ర వర్తి ప్రక్కలో బల్లెములవలె నివి నిలిచియుండెను. వారికున్న స్వతం త్రములు కొన్ని తొలగుటకు వారు సమ్మతించరైరి. ఇటలీలోను ఇతర ప్రదేశములందును ఈ నగరములు, వర్తక తరగతుల యొక్కయు, ముధ్య తరగతుల యొక్కయు (బూర్జువాణి) వృద్ధిని సూచించుచుంచెను, అక్రియాటిక్ సముద్రము పై అధికాము చెలాయించుచున్న వెనీసునగును స్వతంత్ర ప్రజాప్రభుత్వ రాజ్యమైనది (Republic). నేడది చూచుట కెంతో అందముగానున్నది. చుట్టును తిరిగివచ్చు కాలువలగుండా లోనికి వచ్చుచు వెనుకకు పోపుచు సముద్రమెంతో రమణీయముగా నుం డును. కాని నగర నిర్మాణమునకు పూర్వము అది పట్టి తేపు నేలగావుండె నని చెప్పుదురు. హూణుడగు "అట్టిలా" ఖడ్గ సుచేబూని సర్వనాశనము చేసికొనుచుపచ్చి “అక్వీలా"ను ప్రవేశించినప్పుడు కొందరు శీకులు (Fugitives) వెనీసు తేమలలోనికి పాలిపోయిరి. వారచ్చట వెనీసు నగరమును నిర్మించుకొనిరి. వారు తూర్పు రోమక సామ్రాజ్యమున కును పడమటి సామ్రాజ్యమునకును చుధ్యనుండుటచే స్వతంత్రులుగా నుండగలిగిరి. ఇండియానుండియు తూర్పుదేశములనుండియు వెనీసుకు కాంది