పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18 ప్రపంచ చరిత్ర రిచర్డు అనంతరము జా? సింహాసన మెక్కెను. అతడర్యాశాపరుడు అతడు దుర్బలుడు కూడా. అతడు ఆందరికీ కోపము తెప్పించెను. థేమ్సు నదిరోనున్న రన్నీమీద ద్వీపములో కులీనులతనిని పట్టుకొని, కత్తి చూపి, బలవంతాన సూగ్నాకార్టా (సుహా శాసనము) పై చేవ్రాలు పెట్టించిరి. ఇంగ్లాండులోనున్న కులీనుల యొక్కయు, ప్రజల యొక్క యు కొన్ని హక్కుల నాతడు పాలించునట్లు వాగ్దానముచేసిన విషయమందుండెను. రాజకీయ స్వాతంత్ర్యముకొరకు ఇంగ్లాండులో దీర్ఘకాలము చేసిన పోరాట మునకు ఇది మొదటి పెద్దసోపానము, ఏ పౌరుని సొత్తుగానీ స్వాతం త్ర్యముగాని, సాటిపౌరుల అనుమతి లేకుండ రాజు ఆక్రమణచేయకూడ దని అందు ముఖ్యముగా వుదహరించబడినది. దీనినుండియే జ్యూరీ పద్ధతి (Jury System) అచులు లోనికి వచ్చినది. దీనినిబట్టి సాటివారు న్యాయవిచారణ చేయుదురు. ఇంగ్లాండులో ఈ విధముగా రాజు యొక్క అధికారము తొలిరోజులలోనే అరికట్టబడెను. పవిత్రరోమక సామ్రాజ్య ములో అమలులోనున్న రాజు అధీకత (Supremacy) ను గూర్చిన సిద్ధాం తము నాడే ఇంగ్లాండులో అంగీకరింపబడలేదు. 700 సంవత్సరముల క్రితము ఇంగ్లాండులో చేయుబడిన ఈ నిబం ధనము 1982 సంవత్సరమున సైతము బ్రిటిషుపాలనలోనున్న ఇండి యాలో చెల్లుటలేదను విషయము గమనింపదగినది. నేను ఒక వ్యక్తి యైన రాజప్రతినిధి (Viceroy) ఆర్డినెన్సులను జారీచేయుటకూ, శ్వాస ములు నిర్మించుటకూ, ప్రజలఆస్థిని, స్వాతంత్ర్యమును అపహరించుటకూ అధికారముకలవాడు. మాగ్నాకార్టా తరువాత ఇంగ్లాండులో మరియొక గొప్ప విశే గెను, జాతీయ సంఘమొకటి క్రమేణా వృద్ధినందెను. వేర్వేరు గ్రామములనుండియు, నగరములనుండియు పౌరులును, నైటులును (Knights) సంఘానికి పంపబడుచుండిరి. ఇదియే ఇంగ్లీషు పార్లమెం షము