పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

ప్రపంచ చరిత్ర

శుక్రుని నీతిశాస్త్రకాలమువరకును తరుచుగా చెప్పబడ్డ విషయమేమనగా,
రాజు ప్రజాభిప్రాయమునకు తలయొగ్గి యుండవలెనని. చివరకు యజ
మానులు ప్రజలే. ఇది హిందువుల సిద్ధాంతము. క్రియకు వచ్చినప్పుడు
ఇతరదేశములందువలెనే ఇండియాలోని రాజులుకూడ నిరంకుశులై
యుండినను సిద్ధాంతము మాత్రమిదియే. ఈ యభిప్రాయమును ప్రాచీన
యూరోపియనుల యభిప్రాయముతో పోల్చిచూడుము. ఆనాటి న్యాయ
వాదులమాటలనుబట్టిచూడ చక్రవర్తికి సర్వాధికారములును కరగతమై
యుండెను. అతనియిచ్ఛయే శాసనము. వారుచెప్పినమాట, “లోకమున
చక్రవర్తి సజీవశాసనము" అని. ఫ్రెడరిక్కు బార్బరోస్సా చెప్పిన
దేమనగా “రాజుకు శాననములందించేపని ప్రజలదికాదు. అతని ఆజ్ఞ
లను తలదాల్చుటయే వారిపని."

ఈ యభిప్రాయమును చీనావారి యభిప్రాయముతోకూడ పోల్చి
చూడుము. చీనారాజును లేదా చక్రవర్తిని ఆచ్చటివారు స్వర్గపుత్రుడు
మున్నగు పెద్దబిరుదములతో పేర్కొందురు. దీనినిబట్టి మనము భ్రమ
చెందరాదు. సిద్ధాంతమునుబట్టిచూడ అతడు సర్వాధికారియగు యూరో
పియన్ చక్రవర్తికి అన్నివిధముల భిన్నముగా నుండును. మెంగ్ - చే
అను ఒకప్రాచీన చీనాగ్రంథకర్త యిట్లు వ్రాసియున్నాడు. దేశములో
ప్రధానాంశము ప్రజలే. తరువాత భూమిని సస్యములను పోషించు
ఉపకారులగు దేవతలువత్తురు. ప్రాధాన్యమున చివరకువచ్చువాడు పరి
పాలకుడు."

యూరోపులోని చక్రవర్తి భూమిపై సర్వోత్కుష్టుడుగా భావింప
బడుచుండెను. దీనినిబట్టియే రాజులు దైవదత్తాధికారము కలవారనే
భావముదయించెను. క్రియలోమాత్రము వారు సర్వోత్కృష్టతకు చాలా
దూరముగానుండిరి. వారి ఫ్యూడల్ సామంతులే. వారిపై తిరుగబడు
చుండిరి. క్రమక్రమముగా క్రొత్తతరగతిప్రజలు నగరములలో తలఎత్తు