పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రైస్తవమత యుద్ధకాలమున యూరోపు 13

అనునది జర్మనీలో ఒక చిన్నపట్టణమో, గ్రామమో అని నానమ్మకము.
అందుండివచ్చిన కుటుంబమున కాపేరువచ్చినది. 1152 సంవత్సరమున
హోహెన్‌స్టౌఫెన్ కుటుంబమునకుజెందిన ప్రెడరిక్కు చక్రవర్తి
అయ్యెను. సామాన్యముగా అతనిని ఫ్రెడరిక్కు బార్బరొస్సా అనెడి
వారు. మతదండయాత్రలకు పోవుచు త్రోవలో నీటమునిగి చనిపోయిన
వాడీతడే. సామ్రాజ్యచరిత్రలో ఇతని పరిపాలనము మిక్కిలి ప్రశస్త
ముగా నుండెనని చెప్పుదురు. జర్మను ప్రజలదృష్టిలో అతడొకవీరుడు.
ఒకమాదిరి పురాణపురుషుడు. అతనినిగూర్చిన కథలనేకములు గలవు.
అతను ఒక పెద్దపర్వతగుహలో నిద్రించుచుండెననియు. తరుణము
రాగానే అతడులేచి తనప్రజలను రక్షించుటకు వచ్చుననియు చెప్పుదురు.

ఫ్రెడరిక్కు బార్బరోస్సా పోపుతో పెద్దవివాదము పెట్టుకొనెను.
కాని చివరకు పోపుకే విజయముదక్కెను. ఫ్రెడరిక్కు అతనికి తల
యొగ్గవలసివచ్చెను. అతడు నిరంకుశుడగురాజు. కాని అతనిఫ్యూడల్
సామంతులు అతినినెన్నో చిక్కులు పెట్టిరి. ఇటలీలో పెద్దనగరములు
వృద్ధియగుచుండెను. ఫ్రెడరిక్కు వాటిస్వతంత్రత నణచుటకు ప్రయ
త్నించెను. కాని అతడట్లు చేయలేకపోయెను. జర్మనీలోకూడ పెద్ద
నగరములు వృద్ధినందుచుండెను. ముఖ్యముగా నదీతీరములందవి
యుండెను; కొలోన్, హాంబర్గు, ఫ్రాంక్‌ఫోర్టు, ఇట్టివినింకను అనేకము.
వీటివిషయఘుస ఫ్రెడరిక్కు అభిప్రాయము వేరుగానుండెను. కులీనుల
యొక్కయు, ఫ్యూడల్ ప్రభువులయొక్కయు ప్రాబల్యము సరికట్టవలె
ననే వూహతో స్వతంత్ర జర్మను నగరముల కాతడు ప్రాపుగా
నుండెను.

రాజత్వమునుగూర్చి ప్రాచీన హైందవుల యభిప్రాయము
లెట్లుండెనో అనేక సందర్భములలో నీకు చెప్పియుంటిని. ప్రాచీన
ఆర్యులకాలమునుండి అశోకుడి కాలమువరకును, అర్థశాస్త్రకాలమునుండి