పుట:Pranayamamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై రీతిగాభావించి, జపించుచూ,) ఇది ఒక ప్రాణాయామమగును. ఇది కుండ్లినీ శక్తిని త్వరగా మేల్కొలుపును. ఈ రీతిని ఉదయము 3 మారులు సాయంత్రము 3 మారులు చేయుము. నీశక్తి ననుసరించి క్రమక్రమముగ సంఖ్యను కాలమును అధికము చేసికొనుచు రమ్ము. ఈ ప్రాణాయామములో మూలాధార చక్రముపై ధారణ చేయుట ప్రధానాంగము. ప్రాణాయామమును క్రమముగ చేయుచూ, తీక్షణముగ ధారణ, చేయుచున్నచో త్వరలోనే శక్తి లేచును.

ధ్యానసమయమున ప్రాణాయామము

ధారణ ధ్యానములు చేయునప్పుడు ప్రాణాయామము సహజముగ సిద్ధించును. ఇట్టి సమయమున శ్వాస అతి నెమ్మదిగా వచ్చును. మనమందరము మనకు తెలియకుండగనే, ఈ ప్రాణాయామమును చేయుచున్నాము. ఏదైన చక్కని ఆహ్లాదకరమగు కధల పుస్తకమునుగాని, ఏదైన చిక్కుగల లెక్కనుగాని చేయునప్పుడు తదితర విషయముల నన్నిటిని మరచి ఆ విషయమునందే నీమనస్సు పూర్తిగా లగ్నమై యుండును. ఇట్టి సమయమున నీశ్వాసను పరీక్షించుచో చాల నెమ్మదిగా వచ్చుటను కనుగొనగలవు. ఆనందము, విచారము, దు:ఖములను కలిగించు విషయములను చూచుట, వినుటలో కూడ శ్వాస అతి నెమ్మదిగా వుండును. ఇదే సహజముగ వచ్చు ప్రాణాయామము. శీర్షాసనమును అభ్యసించువారికి కూడ సహజముగ ప్రాణాయామము ప్రాప్తించును. ఈ ఉదాహరణల వల్ల, ధారణా ధ్యానములలో శ్వాస చాలా నెమ్మదిగా వుండునని గాని, ఆగి పోవుననిగాని అనుటను కాదనజాలము. మనస్సు ప్రాణము ఒక దానితో ఒకటి దగ్గరి సంబంధము కలిగి వుండుట