పుట:Pranayamamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సికముగ 'ఓం' లేక గాయంత్రి మంత్రమును జపించుము. త్వరగా వృద్ధిలోనికి రాగోరు సాధకులు రోజుకు 320 కుంభకములను 4 పర్యాయములుగా చేయ వచ్చును.

ఈ ప్రాణాయామము సమస్త వ్యాధులను పోగొట్టును. నాడులను పరిశుద్ధ పరచును. మనస్సును నిలకడ గలదిగ చేసి, ధారణ చేయ గలుగునటుల మార్చును. జీర్ణశక్తిని పెంపొందించును. ఆకలిని కలిగింప జేయును. బ్రహ్మచర్య పాలన చేయుటలో సాయపడి, నిద్రించు చున్న కుండలినీ శక్తిని మేల్కొలుపును. భూమినుండి పైకి లేవసాగెదవు.

కుండలిని మేల్కొలుపుటకు

ఈ క్రింద అభ్యాసము చేయునప్పుడు వెన్నెముక యొక్కమూలమగు మూలాధార చక్రమువద్ద ధారణచేయుము.

కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూయుము. 3 'ఓం'లను జపించగలుగునంతవరకు మెల్లిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము. పీల్చునప్పుడు బాహ్యప్రదేశమునుండి ప్రాణమును లోపలికి తీసికొను చుంటినని భావించుము. ఆ తరువాత కుడి వుంగరపు చిటికెన వ్రేళ్ళతో ఎడమ ముక్కును మూయుము. అప్పుడు గాలిని ఆపి, 12 'ఓం'లను జపించుము. ఆ సమయమున మూలాధార చక్రమునకు ఈ ప్రాణశక్తిని పంపుచున్నాననిన్నీ, ఆ ప్రాణశక్తి త్రిదళముగల పద్మమందలి కుండలినీ శక్తిని మేల్కొలుపుచున్న దనిన్నీ భావించుచుండుము. ఈ 12 'ఓం'లను జపించిన పిదప, కుడి ముక్కుతో 6 'ఓం'లను లెక్కించునంతవరకు నెమ్మదిగా గాలిని విడువుము. తరువాత కుడిముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో విడవుము.