పుట:Pranayamamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్ల యిటుల జరుగును. మనస్సుకు ప్రాణము దుస్తులాటిది. అట్టి సమయములలో నీ శ్వాసను పరీక్షించ సాగిన కొద్దిసేపటిలోనే, నీ శ్వాస మరల మామూలు స్థితికి వచ్చును. జపము, ధ్యానము లేక బ్రహ్మ విచార మొనర్చువారికి సహజముగనే ప్రాణాయామము సిద్ధించును.

ప్రాణము, మనస్సు, వీర్యము, ఈ మూడును ఒకే లంకెయం దున్నవి. కావున, వీనిలో ఏ ఒక్కదానిని వశ పరచు కొన్నప్పటికి, మిగిలిన రెండునూ వాటంతట అవే వశమగును. అఖండ బ్రహ్మచర్యమును 12 ఏండ్లు ఒక్క వీర్యపు చుక్క కూడ వ్యర్ధము కాకుండ కాపాడుకొనిన వానికి, మనస్సు, ప్రాణములు పూర్తిగా లోబడును. హఠయోగులు ప్రాణమును వశపరచుకొనియు, రాజయోగులు మనస్సును వశపరచుకొనియు బ్రహ్మను చేరెదరు.

ఈ ప్రాణాయామములో ముక్కులను మూయనక్కర లేదు. కూర్చొని అభ్యసించ దలచుచో కండ్లను మూయుము. శరీరమును మరచి ధారణచేయుము. నడచుచూ చేయుచున్నచో నీవు పీల్చెడి విడచెడి గాలిపై ధారణచేయుము.

నడచునప్పుడు

రొమ్మును విశాలముగ వుంచి, భుజములను వెనుకకు వుండులాగునను తల పైకి వుండులాగునను వుంచి నడువుము, ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క 'ఓం' జపించుచూ 3 'ఓం' లను లెక్కించునంతసేపటివరకు గాలిని రెండు ముక్కులతోను నెమ్మదిగా పీల్చుము. తరువాత 12 'ఓం' లను జపించునంతవరకు కుంభకముచేయుము. తరువాత ఆరు 'ఓం' లను జపించునంతవరకు రెండు ముక్కులతోను గాలిని విడచుము. ఇటుల ఒక ప్రాణా