పుట:Pranayamamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున ఎవరికైన ఏదైనవ్యాధి వచ్చుచో వైద్యులు మందులు ఇంజక్షన్లు మొదలుగాగలవాటిచే నివారించుచున్నారు. కాని, యోగులో చూచినంత మాత్రమున, తాకినంత మాత్రమున మంత్రము నుచ్చరించినంతమాత్రమున రోగియొక్క వ్యాధిని నివారించుటేగాదు, చచ్చినవానిని కూడ బ్రతికించ వచ్చునని చెప్పుచున్నారు.

ఈ యోగులు, ఎడతెగని ధారణవలన అనేకములగు సిద్ధులను పొందెదరు. ఇట్టి సిద్ధులను పొందినవారిని సిద్ధులందురు. సిద్ధులను పొందుటకై వారు సాధనను చేసెదరు. ఇట్టి సాధనలలో ప్రాణాయామము అనునదొక ప్రధానమైన సాధన, ఆసనములను అభ్యసించుటవల్ల స్థూలశరీరము వశపడును. ప్రాణాయామమువల్ల సూక్ష్మశరీరము లింగశరీరములు వశపడును. శ్వాసకు, మజ్జాతంతువులకు చాల దగ్గరి సంబంధము గలదు. అందువలన శ్వాసను వశపరచుకొనుటచే, సహజముగనే ఆంతరిక ప్రాణతంత్రులు వశపడును.

హైందవ మతము ప్రాణాయామమునకు చాల ప్రాధాన్యము నిచ్చును, ప్రతి బ్రహ్మచారి, గృహస్థు, ప్రతిదినము త్రిసంధ్యలందును సంధ్యావందన సమయమున ప్రాణాయామమును చేయవలెను. హిందువులుచేయు ప్రతి మతసంబంధమగు కర్మయందును ప్రాణాయామము గలదు. తినుట, త్రాగుట, ఏదైన చేయుటకు నిశ్చయించుటలకు ముందు తప్పకుండ ప్రాణాయామమునుచేసి, తాను చేసికొనిన నిర్ణయము యొక్క స్వభావమును గుర్తెరింగి, ఆ పిమ్మట నీ నిశ్చయమును మనస్సు నెదుట పెట్టుము, అప్పుడు మనస్సు నీ కోరికను