పుట:Pranayamamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం

ఉపోద్ఘాతము

నేటి యంత్రయుగంలో ఎచ్చటికైన త్వరగ పోవలె నన్నచో, రైళ్ళు, స్టీమర్లు, విమానములు మొదలగువానిని ఉపయోగించుచున్నాము. కాని యోగులు యోగసాధనచే శరీరముయొక్క బరువును తగ్గించి, కొద్దిసేపటిలో ఎంత దూరమునకైన గాలిలో ఎగిరిపోవచ్చునని చెప్పుచున్నారు. వారొక విధమగు తైలమును పాదములకు రాచుకొని ఎంతదూరమున కైనను కొద్దిసేపటిలోనే పోగలిగియున్నారు. ఖేచరీ ముద్ర నభ్యసించుటచే గాలిలో ఎగురుగలిగియున్నారు. ఒకవిధమగు మహిమగల మాత్రను నోటిలోవుంచుకొని రెప్పపాటులో ఎంత దూరమునకైన పోగలరు. దూర దేశమందున్న మన బంధు మిత్రుల యోగక్షేమములను ఉత్తరములవల్లను, తంతి, నిస్తంత్రి వార్తలవల్లను తెలిసికొనుచున్నాము. కాని, యోగులు ధ్యానము వల్ల ప్రపంచమం దెచ్చట ఏమి జరుగుచున్నదో, క్షణము సేపటిలో తెలిసికొనవచ్చునని చెప్పుచున్నారు. లాహిరి యోగి లండను పట్టణమున తన పై యుద్యోగి భార్యయొక్క ఆరోగ్య మెటులనున్నదో తెలిసికొనుటకు యోగసాధనచే పోయెను; దూరమందున్న మిత్రునితో మాట్లాడుటకు మనము టెలిఫోను, వైర్లెసుల నుపయోగించుచున్నాము. కాని, యోగులు యోగమహిమలవల్ల, ఎంతదూరమునందలి విషయమునైన వినవచ్చుననిన్నీ, ఇంతేగాదు - ఈశ్వర వాక్కులను, ఆకాశమందు మనకు కనిపించకుండనున్న అనేక వస్తువులయొక్క ధ్వనులను, మనము వినవచ్చునని చెప్పుచున్నారు. నేటి భౌతిక ప్రపంచ