పుట:Pranayamamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతిగా ఉపవసించుట, రోజుకు ఒకమారు మాత్రమే భుజించుట - మొదలగు వాటిని అన్నిటిని ప్రాణాయామమును అభ్యసించువాడు మానివేయవలెను.

సాధనకు గది

మారుమూలలో లేకుండ వుండులాగున ఒక అందమైన కుటీరమును ఏర్పరచుకొనుము. ఆ గదిని ఆవుపేడతో గాని, తెల్లసున్నముతో గాని చక్కగా అలికించుము. ఆ గదిలో నల్లులు, దోమలు, గోమారులు మొదలగునవి ఏవియు వుండరాదు. దానిని ప్రతిరోజు శుభ్రముగా చీపురుతో వూడ్చుము. ఆ గదిలో సువాసన వచ్చులాగున అగరువత్తులు గంధపుపొడిని వెలిగించుము. ఎక్కువ ఎత్తు ఎక్కువ పల్లము కాకుండ వున్న ఆసనమును ఏర్పరచుకొనవలెను. దానిపై దర్భాసనము, దానిపైన జింకచర్మము, దానిపైన గుడ్డపరచి పద్మాసనములో శరీరమును వంపులేకుండ నిలువుగ వుండు లాగున కూర్చొని, భక్తి భావముతో చేతులుజోడించి, విఘ్నేశ్వరునకు ఓం శ్రీ గణేశాయనమః అని నమస్కరించి, ఆ పిమ్మట ప్రాణాయామమును ప్రారంభించవలెను.

మాత్ర

అరచేతితో మోకాటివరకు ఒక చుట్టు అగునంతవరకు త్రిప్పుటకుగాని, మరీతొందరగాను, నెమ్మదిగాను కాకుండ ఒక వ్రేలితో మరొకవ్రేలుపై (చేతి) కొట్టుటకు పట్టుకాలమును గాని మాత్రయందురు.

ప్రతిక్షణమును మాత్ర యనవచ్చును. రెప్పపాటు సమయమునుగాని, ఒక్కసారి గాలిపీల్చుటకు పట్టు సమయమును