పుట:Pranayamamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాంసము శాస్త్రవేత్తగా చేయుటకు పనికివచ్చునే కాని, వేదాంతి, యోగి, తత్త్వజ్ఞానిగా చేయుటకు పనికిరాదు. ఉల్లి, వెల్లుల్లి ఇవి మాంసముకంటె అపాయ కారులు. ప్రతి ఆహార పదార్థమునందును, కొంత భాగము ఉప్పు వుండును. కాన నీవు, ఆహారపదార్థములకు ఉప్పును జేర్చక పోయినప్పటికి, నీవు తినిన ఆహార పదార్థములనుండి, కావలసిన ఉప్పును శరీరము తీసికొనగలదు. పాశ్చాత్య (ALLOPATHIC) వైద్యులు తెలివి తక్కువగ తలంచు లాగున, ఉప్పును వేరే తీసికొన నందువలన శరీరమునందు ఉదజహరి కామ్లము లోపించి మందాగ్ని ఏర్పడునని నమ్ముట తెలివి తక్కువ. ఉప్పును మానినందు వలన ఏ విధమగు చెడుగు కలుగదు. గాంధీ మహాత్ముడు, యోగానందస్వామి - వీరు పదమూడు సంవత్సరముల కంటె ఎక్కువ కాలమునుంచి ఉప్పును తినుట మాని వేసిరి. ఉప్పును విసర్జించుటవలన నాలుక, మనస్సు వశపడుటయేగాక ఇచ్ఛా శక్తికూడ వృద్ధియగును. ఆరోగ్యము చక్కగ వుండును, నిప్పు వద్ద కూర్చొనుట, ఉపవాసము, ప్రాపంచిక విషయలోలురు, స్త్రీలతో సాంగత్యము, యాత్రలు, దూరపునడక, పెద్ద పెద్ద బాధ్యతలను పెట్టుకొనుట, ప్రొద్దున చాల పెందలకడ చన్నీటి స్నానము, కటువైన మాటలు, అబద్ధములు చెప్పుట, మోసకృత్యములు, దొంగతనము, జీవహింస, మనో వాక్కాయ కర్మలకు సంబంధించిన అన్ని విధములగు హింసలు, ఎవరితోనైన విరోధము, ఎవరిపైనైన అసూయ, దెబ్బలాట, పోట్లాట, గర్వము, కపటము, కుట్రలు చేయుట, చాడీలు చెప్పుట, కొండెములు చెప్పుట, తిన్నగా మాట్లాడకుండుట, ఆత్మకు మోక్షమునకు సంబంధించని సంభాషణలు, మనుష్యులు జంతువులకు భయమును కలిగించుట,