పుట:Pranayamamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని మాత్ర యనవచ్చును. ‘ఓం’ అను ప్రణవమును ఉచ్చరించుటకు పట్టు కాలమునుకూడ మాత్రయందురు. ఇది సులభమైనది. ప్రాణాయామసాధకులు దీనినే కాలమును లెక్కించుటకు ఉపయోగింతురు.

పద్మాసనము

దీనిని కమలాసనము అనికూడ అందురు. కమలము అన పద్మము. ఈ ఆసనము వేసినప్పుడు పద్మమువలె వుండుటచే, ఈ పేరుతో పిలువబడినది.

జపము, ధ్యానములకుగాను నిర్ణయింపబడిన నాల్గు ఆసనములలోనను, పద్మాసనము శ్రేష్ఠమైనది. ధ్యానమునకు యిది శ్రేష్ఠమైనది. ఘేరండుడు, శాండిల్యుడు మొదలగు ఋషులు దీనిని గొప్పగ పొగడెదరు. ఇది గృహస్థులు, స్త్రీలు, సన్నగ వుండువారు, యువకులు అందరకు అనుకూలమైనది.

రెండు కాళ్ళను బారజాపుకొని క్రిందకూర్చొనుము. ఆ పిమ్మట, కుడిపాదమును ఎడమతొడపైన ఎడమ పాదమును కుడితొడపైన పెట్టుము. చేతులను మోకాళ్ళపై పెట్టుము. లేనిచో, చేతివ్రేళ్ళను ఒకదానిలో నొకటి దూర్చి ఎడమ చీల మండపైన పెట్టవచ్చును. ఇది కొందరకు సౌకర్యముగ వుండును. లేకపోయిన, ఎడమ చేతిని ఎడమ మోకాటిపైన, కుడిచేతిని కుడిమోకాటిపైన పెట్టుము. అటువంటి సమయమున అరచెయ్యి మోకాటివైపు వుండులాగునను, చూపుడువ్రేలు బొటనవ్రేలి మధ్యభాగమును తాకులాగునను చిన్ముద్ర పెట్టుము.

సిద్ధాసనము

పద్మాసనము తరువాత సిద్ధాసనము శ్రేష్ఠమైనది. కాని కొందరు ‘ధ్యానము’ చేయుటకు ఈ ఆసనము, పద్మాసనము