పుట:Pranayamamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ శ్వాసావయవములలో కుడి కోశములో మూడు వృత్తములు, ఎడమ కోశములో రెండు వృత్తములు వుండును. ప్రతికోశమునందు ఒక శిఖ, ఒక ఆధారము వుండును. ఈ ఆధారము, పొట్టను గొంతును వేరుపరచు గోడయగు మహా ప్రాచీర వైపు ముఖము గలిగి యుండును. ఇక శిఖయో, పై భాగమున అనగా మెడయొక్క మూలమునకు దగ్గరగా వుండును. పుప్వూజ్వరము వచ్చినప్పుడు ఈ ఆధారమున మంటగా వుండును. ఈ శిఖకు సరిపోవు నంతటి ప్రాణ వాయువు లభించక పోయినచో క్షయవ్యాధి కలుగును. ఇదే క్షయవ్యాధి బీజములను (T.B) సృష్టించుటకు కారకురాలు, కపాలవతి, భస్త్రిక ప్రాణాయామముల వల్ల కావలసినంత ప్రాణవాయువు లభించును. అంతేగాక క్షయవ్యాధి రాకుండుటయేగాదు, చక్కటి మధురమైన గొంతు కూడ ప్రాప్తించును.

ముక్కులోపల రెండు గాలిగొట్టములు వుండును. ఇవి రెండు స్వరతంతులను కలిగి యుండును. మనము గాలిని ముక్కుతో పీల్చిన తదుపరి, ఆ గాలి సప్తపథ, గొంతు క్రోపుల గుండా శ్వాసనాళములోనికి పోవును. అచ్చటినుండి, కుడి ఎడమ సూక్ష్మ శ్వాసనాళములలోనికిన్నీ, అచ్చటినుండి అసంఖ్యాకములగు అతి సూక్ష్మ శ్వాసనాళములలోనికిన్ని పోవును. ఆ పిమ్మట శ్వాసావయవములో గల లక్షలకొలదిగా గల అతి సూక్ష్మములైన వాయుకోశములలోనికి ఈ గాలిపోయి, అచ్చట ఆగిపోవును. ఈ వాయుకోశములను ఒక చదునైన స్థలములో పరచినచో అవి 1,40,000 చ.అ.ల స్థలము నాక్రమించును.

మహాప్రాచీర, గాలిని శ్వాసావయవముల లోనికి తెచ్చును. ఈ మహాప్రాచీర తెరచుకొని యున్నప్పుడు రొమ్ము