పుట:Pranayamamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్వాసావయవములయొక్క విస్తీర్ణము పెరుగును. అట్టి సమయములో, ఈ రీతిగా మహాప్రాచీరను తెరచియుంచి రొమ్ము శ్వాసావయవములను విస్తరింపజేయుటచే ఏర్పడిన శూన్య స్థలములోనికి, బయటగల గాలి ప్రవేశించును. గాలిని బయటకు విడచినప్పుడు గుండె, శ్వాసావయవములు ముకుళించుకొనును.

స్వరయంత్రమున గల స్వరతంత్రులవలన శబ్దము కలుగు చున్నది. అతివాగుడు, మితిమీరి పాడుట, ఉపన్యసించుటవలన స్వరతంత్రులు చెడిపోయి గొంతు బొంగురు, కటువైన గొంతు ఏర్పడును. ఈ స్వరతంత్రులు స్త్రీలయందు పొట్టివిగావుండును. అందువలన వారి కంఠము మృదువుగను, మధురముగను వుండును. మనుష్యుని సాధారణ ఉచ్ఛ్వాసనిశ్వాసల పరిమాణము, నిమిషమునకు పదహారుమార్లు, న్యూమోనియా వ్యాధి పీడితుడు నిమిషమునకు 60, 70 లేక 80 మార్లు శ్వాసోచ్ఛ్వాసల నొనర్చును. ఉబ్బసవ్యాధిగలవాని సూక్ష్మ శ్వాసనాళములలో ఒకవిధమగు ఈడ్పువుండును. అందుచే అవి ముడుచుకుపోవును. ఇందువలన గాలిపీల్చుటలో అతనికి ఎంతో శ్రమ గలుగును. ప్రాణాయామము చేసినందువల్ల, ఈ సూక్ష్మశ్వాసనాళములు బాగుపడును. ఊపిరి గాలిగొట్టముయొక్క పై వరుసలో ఒక సన్నని టోపివుండును. దీనినే గోజిహ్వక యందురు. ఈ గోజిహ్వక నీటిని, ఆహారద్రవ్యములను శ్వాస గొట్టములోనికి పోకుండులాగున ఆపుచేయును. ఒకవేళ ఏదైన కారణము వల్ల, శ్వాసగొట్టములోనికి గాలిగాక, మరే పదార్థమైన పోవుటకు ప్రయత్నించినచో, వెంటనే దగ్గువచ్చును. ఆ రూపేణా పదార్థము బయటకు నెట్టివేయబడును.

శ్వాసావయవములు రక్తమును పరిశుద్ధపరచును. ఈ రక్తము ప్రాణపోషక పదార్థములతో ధమనులనుండి బయలు