పుట:Pranayamamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చును. నీకు తగిన గురువు లభించనిచో, నీ కన్న ఉచ్చస్థితికి వచ్చిన సాధకుల సహాయమును గైకొమ్ము.

ప్ర: ప్రాణాయామాభ్యాసము చేసినంత మాత్రముననే కుండలినీ శక్తి లేచునా ?

జ: అవును. ఆసనములు, బంధములు, ముద్రలు, ప్రాణాయామము, జపము, ధ్యానము, దృడేచ్ఛ, గురుకృప, భక్తి - యివన్నియు కుండలినీ శక్తిని లేపగలవు.

ప్ర: ఖేచరీ ముద్రవల్ల కలుగు ఫలములేమి ?

జ: ఇది శ్వాసను నిరోధించుటకు సాయపడును. దీనివల్ల ధారాణ ధ్యానములు చక్కగా నిలచును. ఆకలి దప్పులు తగ్గును. శ్వాసను ఒక ముక్కునుండి మరొక ముక్కుకు సులభముగ మార్చవచ్చును. కేవలకుంభకము సులభముగ సిద్ధించును.

ప్ర: ప్రాణవాయువు సుషుమ్న గుండా పోవుచున్నదని తెలసికొనుటకును, ప్రాణాపానములు ఐక్యమైనవని తెలసికొనుటకును గల నిదర్శనము లేవి ?

జ: ప్రాణాపానములు ఏకమై, అవి సుషుమ్న గుండా పోవునప్పుడు, అట్టివాడు ప్రాపంచిక విషయములతో సంబంధము లేనివాడుగ వుండును. అన, శరీర స్మృతి వుండదు; పరిసరములు, ప్రాపంచిక స్మృతికూడ వుండదు. కాని స్పృహగలిగియే వుండును. అతనికి మొట్ట మొదటి సాధారణ సమాధులలో ఆత్మానందము లభించును. తరువాత క్రమక్రమముగ ఒక్కొక్క చక్రము వరకు ప్రాణము పోయినప్పుడు, యిదివరలో చెప్పబడిన వివిధములగు అనుభవములు కలుగును. సహస్రారమునకు చేరుటచే సమాధి లభించును.

ప్ర: ప్రాణాయామమందు మూలబంధములో అంత