పుట:Pranayamamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాలు, 2 అరటిపండ్లు, లేక 2 నారింజపండ్లు లేక 2 ఆపిలు పండ్లను రాత్రియందును తీసికొనవలెను. రాత్రిభోజనము అతి తేలికగా వుండవలెను. పాలు, ఫలములతో మాత్రమే కూడి యుండు ఆహారము సాధకులకు మిక్కిలి లాభకారి.

______

ప్రశ్నోత్తరములు

____(0)____

ప్రశ్న: రాజయోగమునకు ప్రాణాయామము అనవసరమా ?

జ: కాదు. ప్రాణాయామము రాజయోగమునందలి అష్టాంగములలో నొకటి.

ప్ర: గురుసాహాయ్యము లేకుండా ప్రాణాయామా భ్యాసముచేయుట అపాయకారియా ?

జ: ప్రజలు అనవసరముగ సందేహింతురు. సామాన్య ప్రాణాయామములను గురువు లేకుండగనే చేయవచ్చును. దీర్ఘ కుంభకము, ప్రాణాపానములను ఐక్య మొనర్చుటలను అభ్యసించ గోరువారికి గురువు అవసరమే. గురుసాహాయ్యము దొరకనిచో యోగసిద్ధి పొందినవారు రచించిన గ్రంథముల సహాయము గైకొనవచ్చును. ఎటులైనను ఒకగురుని ఏర్పఱచుకొని, అతనితో కనీసము ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారానైనను సందేహములను నివర్తించు కొనుటమంచిది. 1 2 లేక 1 లేక 2 నిమిషములవరకు ఏ భయము లేకుండ కుంభకము చేయ