పుట:Pranayamamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టను పూరక కుంభక రేచకములను 1 : 4: 2 నిష్పత్తిలోనే పాటించవలెనా ?

జ: అవును.

ప్ర: బంధత్రయ ప్రాణాయామ సాధనలో పూరకము 10 మాత్రలు, కుంభకము 40 మాత్రలు, రేచకము 20 మాత్రలసేపు చేసెననుకొనుడు, ఇందులో ఎంతసేపు శుద్ధకుంభకము వుండవలెను ! ఉద్యాణబంధముతో పాటు రేచకము చేయుటకు ఎంత విరామమివ్వవలెను ?

జ: ప్రారంభకులు బంధత్రయ సాధనలో రేచకమునకు విరామమివ్వనక్కరలేదు. ఉచ్చస్థితికి వచ్చిన వారు 5, 6 సెకండ్ల సేపు విరామ మివ్వవచ్చును. బంధత్రయములో ప్రాణాపానైక్యమునకు పూరక కుంభక రేచకముల నిష్పత్తి 1 :4 :2 చాలును.

ప్ర: తాడనక్రియ, మహావేధలలో గల భేదమేమి ?

జ. తాడనక్రియలో ఏవిధముగనైన గాలిని పీల్చ వచ్చును. కాని మహావేధ ప్రాణాయామములో బంధత్రయములో చెప్పబడిన రీతిని చేయవలెను.

ప్ర: భగవద్దర్శనము పొందుటకు ప్రాణాయామము అవశ్యకమా ?

జ: కాదు.

ప్ర: బ్రహ్మరంధ్రమునకు ప్రాణము గొంపోవబడినపుడు గుండుసూదితో పొడిచినట్లుండునా ? జ: ఉండదు.

ప్ర: ఊర్ధ్వ రేత ప్రాణాయామ మననేమి ?

జ. సుఖపూర్వక ప్రాణాయమము లేక అనులోప విలోమ ప్రాణాయామము చేయునప్పుడు వీర్యము ఓజస్సుగనే