పుట:Pranayamamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ర' దీని బీజాక్షరము, గాలిని 'ర'ను ఉచ్చరించుచూ అగ్ని వాసస్థానమునకు పీల్చి, త్రినేత్రుడు, వాంఛలను తీర్చువాడు. మధ్యాహ్న సూర్యుని వంటి రంగు గలవాడు అగు రుద్రుని ధ్యానించవలెను. ఈ రీతిని రెండు గంటలు ప్రతి నిత్యము ధ్యానించువాడు అగ్నివలన ఏవిధముగను బాధింపబడడు.

వాయు ధారణ

హృదయమునుండి రెండు కనుబొమల మధ్యవరకు వాయు 'తత్త్వ వాసస్థానము, నలుపురంగు, బీజాక్షరము 'య' వాయు తత్త్వ వాసస్థానమునకు గాలిని పీల్చి, ఈశ్వరుని ధ్యానించవలెను. ఇట్టి వానికి వాయువు వల్ల మరణమురాదు.

ఆకాశ ధారణ

రెండు కనుబొమల మధ్యనుండి తలపైవరకు ఆకాశ వాసస్థానము. పొగరంగు గలిగి, వృత్తాకారముగ వుండును. 'హ' బీజాక్షరము. ఆకాశవాసస్థానమునకు గాలిని పీల్చి, సదా శివుని ధ్యానించవలెను. ఇట్టివాడు పైకి ఎగురగలుగుటే గాక, అనేక సిద్ధులను పొందును.

యోగి భుశుండుని చరిత్ర

యోగులలో చిరంజీవులుగా వున్నవారిలో భుశుండుడు ఒకడు. ప్రాణాయామశాస్త్ర పండితుడు. మహామేరువుకు ఉత్తర శిఖరముపైగల కల్పవృక్షముయొక్క దక్షిణశాఖపై పర్వతమంత పెద్దదగు గూటిని కట్టుకొని యీ భుశుండుడను కాకి నివసించుచుండెడివాడు. యోగు లందరికంటె ఎక్కువ