పుట:Pranayamamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలము జీవించినవానిగా యితనిని చెప్పెదరు. ఈతడు త్రికాల జ్ఞాని. ఎంతసేపటివరకైన యోగసమాధిలో వుండగల శక్తి శాలి, వాంఛారహితుడు. ఉత్తమమైన శాంతిని, జ్ఞానమును పొందిన మహాత్ముడు. ఇతడు తన గూటియందే ఆత్మానందము ననుభవించుచూ, యిప్పటికిని జీవించియుండెను. ఆతడు బ్రహ్మ శక్తియగు అలంబుసోపాసకుడు. తన యీ గూటియందే ఎన్నో కల్పములనుండి నివసించుచూ పంచవిధధారణలను చేసి సిద్ధిని పొందెను. ద్వాదశాదిత్యులు తమ ప్రభావముచే ప్రపంచము నంతను భస్మమొనర్చునపుడు తన ఆపోధారణచే ఆకాశమును చేరును.

ఈ కిరణాగ్నినుండి అగ్నిధారణనుచేసి తన్ను కాపాడు కొనును. ప్రపంచమంతయు జలమయ మైనప్పుడు, వాయుధారణ చేసి మహామేరు సహితముగా నీటిపై తేలియుండును. సృష్టి యంతయు వినాశమగు కాలము వచ్చినప్పుడు బ్రహ్మవాసస్థాన మందు పున:సృష్టి జరుగునంతవరకు సుషుప్త్యవస్థ యందుండి సృష్టి జరుగుటతోడనే తిరిగి తన వాసస్థానమునకు వచ్చును. ఈ రీతిని ఆతని సంకల్పమువల్ల ప్రతికల్పమందును చేయుచుండును.

ఆంతిరిక యంత్రము

మనము తీసికొను ఆహారము నత్రజని సంబంధమైన ద్రవ్యములు, మాంసకృత్తులు, క్రొవ్వు, పిండిపదార్థములు మొదలగువానితో కూడియున్నది. (నెయ్యి, బియ్యము, పంచదార మొ) మాంసకృత్తులు స్నాయువులను, ధాతువులను నిర్మించును. పిండిపదార్థములు శక్తిని కలిగించును. ఇవిగాక