పుట:Pranayamamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలవాడవై యున్నచో, యోగసాధన అయిన పిమ్మటనే తీర్చుకొనవచ్చును.

13 మొట్ట మొదట కొంతసేపు జపధ్యానములు చేయుము. తరువాత కొంతసేపు ఆసన, ప్రాణాయామములు చేయుము. ఆ తరువాత మరికొంతసేపు ధ్యానముచేయుము.

14. నిదురనుంచి లేవగనే, నిద్రమత్తుగానున్నచో కొంచెముసేపు ఆసన, ప్రాణాయామములు చేయుము. ఇందుచే మత్తుపోయి, ఏకాగ్రత లభించును.

15. ఈ క్రియలను యీ క్రిందిక్రమము ప్రకారము చేయుము. ఆసనములు, ముద్రలు, ప్రాణాయామము, ధ్యానము. ఉదయసమయమున చేయుచో, జపము, ధ్యానము, ఆసనములు, ముద్రలు, ప్రాణాయామములను వరుసగ చేయుము. ఈ రెండింటిలో నీకు అనుకూలముగ వున్నరీతిని చేయుము. ఆసనములు తరువాత ప్రాణాయామము మొదలు పెట్టుటకు పూర్వము, అయిదు నిమిషములు విశ్రాంతి తీసికొనుము.

16.కొన్ని హఠయోగ గ్రంథములు ప్రాత:కాలమందు చన్నీటి స్నానము చేయుటను నిషేధించును. ఇటువంటిది అతి శీతల ప్రదేశములగు కాష్మీర్, ముస్సోరీ, డార్జీలింగ్ మొదలగు ప్రదేశములలో ఉదయం 4 గంటలప్పుడు స్నానముచేయు వారికై యుండవచ్చును. కాని, వేడిప్రదేశములందుండు వారి విషయమై కాదు. యోగసాధనకు కూర్చొనబోవుటకు ముందు చన్నీటి స్నానము చాల ఆరోగ్యకరము.

17. ఆసనములు, ప్రాణాయామములు అన్ని వ్యాధులను కుదుర్చును. ఆరోగ్యమును కలిగించును. జీర్ణశక్తిని వృద్ధి చేయును, నరములకు పుష్ఠినిచ్చును. సుషుమ్నా నాడిని బాగు చేయును. కుండలినీ శక్తిని మేల్కొలుపును. రజస్సును లేకుండ