పుట:Pranayamamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. ఉదయం 4 గం. లకు నిద్ర లెమ్ము. అరగంటసేపు జపముగాని, ధ్యానముగాని చేయుము. తరువాత ఆసనములను ముద్రలను చేయుము. 15 ని. విశ్రమించుము. ఆ పిమ్మట ప్రాణాయామము చేయుము. ఈ ఆసనములతో శరీర వ్యాయామములను కూడ కలిపి సులభముగ చేయవచ్చును. నీకు వీలున్నచో ధ్యానాదులు ముగించుకొన్న పిదప వ్యాయామము చేయవచ్చును. నిదురనుండి లేవగనే జపము, ధ్యానములను చేయబోవుటకు ముందు, ప్రాణాయామమును చేయవచ్చును. ఇందువలన శరీరము తేలికగా వుండి, ధ్యాన సుఖము లభించును. నీవీలు, కాలముల ననుసరించి, ఒకనిర్ణీత కార్యక్రమము నేర్పరచుకొనుము.

10. ఆసన ప్రాణాయామములు చేయునప్పుడు వీటితో జపముకూడా చేసినచో, పూర్తియగు ఫలితములు కనిపించును.

11. నిదురనుండి లేవగనే ఉదయము 4 గం. లప్పుడు జపము, ధ్యానములను చేయుట మంచిది. ఏలన, ఈ సమయమున మనస్సు ప్రశాంతముగ నుండును. అందువలన ఏకాగ్రత లభించును.

12. ఎక్కువమంది జనులు పవిత్రమగు ప్రాత:కాల సమయమును ఒక అరగంటసేపు మలవిసర్జన చేయుటకు, మరొక అరగంట ముఖము కడుగుకొనుటకు వ్యర్థము చేసెదరు. ఇది తప్పు. సాధకులు పది నిమిషములలో పై రెండుకార్యములను నెరవేర్చుకొనవలెను.. మలబద్ధకముచే పీడింప బడుచున్న వాడవైనచో, నిద్రనుండి లేవగనే అయిదు నిమిషములసేపు శలభ, భుజంగ ధనురాసనములను వేయుము. లేక ఆలస్యముగ కాలకృత్యములను నెరవేర్చుకొను అలవాటు