పుట:Pranayamamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయును. ఆరోగ్యము, శరీరపుష్టి, లేనిదే ఏ సాధనచేయుటకు వలను కాదు; గాన ధ్యానయోగులు, కర్మ భక్తి యోగులు, వేదాంతులు అందరు హఠయోగ క్రియలను చేయుట లాభకరము.

18. శరీరారోగ్యము లేకుండా ఏ విధమగు కార్యములను చేయజాలము. కావున ప్రతివాడు శరీరారోగ్యమును నిలుపుకొనుటకు తెలసియో తెలియకయో యేదో హఠయోగ క్రియను చేయుచునే వున్నాడు.

19. అసౌకర్యముగా తోచినప్పుడు ప్రాణాయామము చేయుము. వెంటనే ఓపిక వచ్చును. నీవు ఏదైన వ్రాతపని మొదలు పెట్టబోవుటకు ముందు, కొంచెముసేపు ప్రాణాయామము చేయుము. చక్కని, ఆశ్చర్యకరమైన భావములు తట్టును.

20. కొందరు ప్రధమములో ఎక్కువ శ్రద్ధతో సాధనచేసి, కొద్దికాలము కాగానే మాని వేసెదరు; లేదా ఒకరోజు చేయుటా, ఒకరోజు మాని వేయుటా చేసెదరు. ఇది తప్పు.

21. తమలో గల మాలిన్యమును స్వార్ధరహిత సేవ, విక్షేపము, యోగసాధనలచే పారద్రోలు కొనుటకు ప్రయత్నించ కుండగనే, సాధన ప్రారంభించుటయే తడవుగా కుండలినీ శక్తిని పైకిలేపి, బ్రహ్మకారవృత్తిని పొందవలెనని చాల మంది కోరుదురు. ఇది తప్పు. ఇట్టి స్థితిని పొందగోరు వారు మనో వాక్కాయకర్మలందు పారిశుద్ధ్యము, మానసిక శారీరక బ్రహ్మ చర్యములను కలిగి యుండవలెను. అప్పుడే కుండలినీ శక్తిని లేపుటచే గలుగు ఆనందము లభించ గలదు.

22. పడుచుతనమునందే ఆధ్యాత్మిక బీజములను నాటుము. వీర్యమును వ్యర్థముచేసి కొనకుము. ఇంద్రియములను, మనస్సును కట్టుబాటు నందుంచుము. సాధనను చేయుము.