పుట:Pranayamamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శరీరముసన్నగను, బలముగను ఆరోగ్యముగను వుండును. లావు తగ్గును, ముఖమునందు తేజస్సు వుండును. కనులు ప్రకాశవంతముగ మెరయు చుండును. గొంతు మధురముగ వుండును. ఆంతరిక అనాహత శబ్దములు చక్కగా వినిపించును. అన్ని రోగములనుండి విముక్తుడగును. బ్రహ్మచర్యమును గలిగి యుండును. వీర్యము చిక్కగా వుండును. జఠరాగ్ని పెంపొందును. అప్సరసలు వచ్చి మీద పడినను కూడ చలించని మనో నిలుకడను కలిగి యుండును. ఆకలి చక్కగా వుండును. నాడులు పరిశుద్ధ మగును. మనస్సు ఏకాగ్రత గలదిగా అగును. రజస్తమములు నిర్మూల మగును. ధారణా ధ్యానములు చేయుటకుగాను మనస్సు యోగ్యమైనదిగా అగును. మల మూత్రముల పరిమాణము తగ్గును. ఊర్థ్వ రేత యోగి యగును. ఉచ్చస్థితికి వచ్చిన సాధకులు పైసిద్ధులనన్నిటిని పొందెదరు.

సామాన్య జ్ఞానమునకు అందుబాటులో లేని అనేక విషయములుగలవు. వాటిని ధారణ ధ్యానాదులవల్ల మాత్రమే తెలిసికొనగలము. అట్టిజ్ఞానమును సంపాదించుటయే యోగము యొక్క ఆదర్శము. ప్రాణాయామమువల్లనే యిట్టిస్థితిని పొంద గలము. అప్పుడే మనకు ఆత్మజ్ఞాన ప్రాప్తికాగలదు.

_____

ప్రత్యేక సూచనలు

1. ఉదయము పెందలకడ కాలకృత్యములను తీర్చికొని సాధన చేయుటకు కూర్చొనుము. తేమ లేకుండావుండి; చక్కగా గాలివచ్చెడి గదిలో ప్రాణాయామము చేయుము. ప్రాణాయా