పుట:Pranayamamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక అంగుళము నిడివిగల శ్వాసను లోపల ఆపివేయుటచే భవిష్యత్తు చెప్పగల శక్తియూ, రెండు అంగుళములు ఆపుచేయ గలుగుటచే ఇతరుల మనస్సునందుగల విషయములను చెప్పగలశక్తియు, మూడంగుళములవల్ల భూమిపై నుండి లేవగలుగుటయు, నాల్గంగుళములవల్ల యోగ దృష్ట్యాదులును, అయిదంగుళములవల్ల ఎవరికినీ కనిపించకుండ వుండగలుగుటయు, ఆరంగుళములవల్ల కాయసిద్ధియు, ఏడంగుళములవల్ల పరకాయ ప్రవేశమున్నూ, ఎనిమిదంగుళములవల్ల ఎల్లప్పుడు పడుచువానివలె వుండగలశక్తియు, తొమ్మి దంగుళములవల్ల దేవతలచే సేవకులవలె పనిచేయించుకొన గలుగుటయు, పదంగుళములవల్ల అణిమాది సిద్ధులును, పదకొండంగుళములవల్ల పరమాత్మైక్యము సిద్ధించును. మూడుగంటల సేపటివరకు పూర్తిగా కుంభకము చేయగల యోగి, తన కాలి బొటనవ్రేలిపై శరీరము నంతను నిలపగలడు. ఇంతేగాదు అన్నివిధములగు సిద్ధులను పొందును. అన్నివిధములగు పాపములను పోగొట్టుకొనినవాడగును. ప్రత్యాహారమువల్ల మనశ్శాంతి లభించును. ధారణ వల్ల మనస్సు నిలకడ గలదిగా యగును.. ధ్యానము శరీరమును ప్రపంచమును మరచులాగున చేయును. సమాధి బ్రహ్మానందము, జ్ఞానము, శాంతి ముక్తుల నిచ్చును.

"శస్తుంతాలు చక్రం తత్ర అమృత తధారా ప్రవాహ కంటిక మూలరంధ్ర రజతంతి సంథిని వివర్థ్వరం తత్ర శూన్యం ధ్యాయేత్ చిత్లయోభవతి" యోగ సమాధి సమయమున బొడ్డునుండి తలవరకు బ్రహ్మ రంధ్రము నందలి అమృతము ప్రవహించును. అప్పుడు యోగి దానిని ఆనందముతో పానము చేయును. ఈ యోగామృతమును పానము చేసి నెలల తరబడి ఆహారము లేకుండ వుండగలడు. అప్పుడు