పుట:Pranayamamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మము చేయుటకు గాఢమైన ఏకాగ్రత శ్రద్ధలు కావలెను. నీకు అనుకూలముగావుండు ఆసనములో కూర్చొనుము. మనస్సు యొక్క ఏకాగ్రతను చెరచు ఏ వస్తువును నీ సమీపమున వుండనివ్వకుము.

2. ప్రాణాయామము చేయుటకు కూర్చొన బోవు ముందు, ముక్కులను బాగా శుభ్రపరచుకొనుము. సాధనను చేయబోవుటకు ముందు కొద్దిగా పళ్ళరసము లేక పాలు లేక కాఫీని తీసికొనవచ్చును. సాధన ముగిసినతరువాత 10 నిమిషముల అనంతరము ఒక గ్లాసెడు పాలుగాని ఏదైన అల్పాహారమునుగాని తీసికొనుము.

3. ఎండాకాలములో ఉదయము ఒకసారి మాత్రమే అభ్యాసముచేయుము. మెదడు లేక తల వేడిగానున్నచో భృంగామలక తైలమునుగాని, వెన్ననుగాని స్నానము చేయ బోవుటకు పూర్వము మర్ధనచేయుము. నీటిలో పటికబెల్లపు పొడిని కరగించి, ఆ షర్బత్తును త్రాగుము. ఇందువల్ల శరీరమునందలి వేడి తగ్గును. శీతలి ప్రాణాయామమునుకూడ చేయుము. ఇందువల్ల శరీరముకు ఉష్ణాధిక్యము కలుగదు.

4. అతివాగుడు, మితిమీరితినుట, అతినిద్ర, మిత్రులతో అతిగా కలసివుండుట, అతి శ్రమ కలిగించెడి పనులను మానుము. "యోగము మితిమీరి మెక్కువానికిగాని, మితిమీరి ఉపవసించువానికిగాని, మేల్కొనువానికిగాని సిద్ధించదు". (గీత 6-16 అన్నముతోపాటు నెయ్యి కలుపుకొని తినుము. ఇందువలన వాయువు సులభముగ సంచరించును.

5. "మితాహారం వినా యస్తు యోగారంభంతు కారయేత్| నానారోగో భవేత్తస్య కించిత్ యోగో న సిధ్యతే." (ఘే.సం. 5-16)