పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిని. వచ్చిన వైదిక బృందము నేను కర్మ కలాపములు చేయ కూరకుంటి నని గర్హింప సాగిరి. శాస్త్ర నిర్ణయమును మా యింటి ప్రక్కనే ఉన్న సాంబ శివ శాస్త్రిగా రను విద్వాంసులు నిరూపించి యా వైదిక గోష్టిని నో రేత్తకుండఁ జేసిరి. అప్పుడు కర్మకలాప మంతయు ముగిసిన తర్వాత అన్నాతురులగు ప్రజలకు వర్ణవిభేదము లేకుండ ఒక నాఁ డెల్ల నేడెనిమివందలమందికి సంతర్పణము గావించితిమి. సంకల్పము నాది గాని నిర్వాహ మెల్ల మా తమ్ములు చేసిరి. వీధి యెల్ల శుభ్రపఱచి విస్తళ్లు వేసి భోజనములు పెట్టితిమి. కొందఱు వీధి యెల్ల చండాల భోజనముతో నంటైనదని గర్హించిరి. చుట్టుపట్టుల యూళ్ళ నలజడి రేగను. మా నిర్ణయము నిర్వక్రముగా సాగెను. ఇట్టి సంకల్పము నాలో పొడముట నా బాల్యమున నాలోఁ గుదుర్కొన్న యవయక్తభావ కారణమున నుండి వెడలిన కార్యవికాసమే యగుట నిటీవల గుర్తించితిని.

మరియు ముక్త్యాలలో జరిగిన నా కుమారుని వివాహామున గూడ నక్కడి సర్వ జాతుల వారికిని, పాకీ వారికి గూడ ఒక్కొక్క నాఁ డొక్కొక్క జాతివారికిఁగామృష్టాన్నసంతర్ప్ము జరుపుటయ్యెను. ఈ సందర్భమునఁగూడ మా తమ్ములే నిర్వహకులు. ఆ వివాహ సందర్భములో మా కాప్త మిత్రులు, శ్రీ ముక్త్యాల ప్రభువులు తమ యింటి వివాహముగా వివాహసర్వవ్యయము ఎన్ని వే