పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ సాధువు కన్నీరు కార్చుచు ఆకసముకేసిచూచి తలవాల్చి కేలుదోయి సుర్యభాగవనునికి మోడ్చి 'తండ్రీ!నేనేపాపమునెఱుఁగను. నన్ను వీరు తిట్టుచున్నారు. సర్వసాక్షివి! చూచుచున్నావు! కనికరించు మో దేవా! అని చేతి కుండిలోని నీటితో బిక్కమొగము కడుగుకొని యక్కడ నుండి వెడలిపోయెను. ఆ సాధు వట్లు సూర్యునికి మ్రొక్కుచు మండుటెండులో మాడుచు నాడినపలుకుకు నా గుండెలలో వేడిగా నాఁటుకొనెను. ఒడలు జలదరించెను. ఇంటికి వెళ్లునప్పటికీ తివ్రజ్వరమువచ్చెను. మూఁడు నాళ్ళు చాల బాధపడితిని. ఆ బ్రాహ్మణుని ధౌర్త్యము, ఆ సాధువు జాలిమాటలు నాలో నా మూఁడు నాళ్లు నెంతో గందర గోళము గల్గించినవి. మా తల్లిదండ్రుల కీ గొడవనేనుతెలుపలేదు. క్రమక్రమముగా నా జ్వరము తగ్గినది. ఆ మూఁడునాళ్ళ శరీరకంపములో నాలో నెంతో లోతున నేదో భావము పాతుకొని పోయినది. ఈ సంభవము మాత్రము నాకు పలుతూరులు స్మృతిపదమున మెలగుచునే యుండి నది. కానీ అది లోఁ బాదుకొనిపోయి నాలో నుండి వెడలించిన వివేకజ్వాలలను మాత్రము నే నిటీవలనే _ ఈ విషయము వ్రాయుచున్నప్పుడే- స్పష్టముగా నిరూఢముగా నెఱుఁగ గల్గితిని.

పండ్రెండేండ్లకు ముందు మా మాతృ శ్రీ దివ్యధామ మందగా ఔర్ధ్యదైహిక కర్మకలాపము మాయన్నగారుచేసిరి. నేనుతద్దినముపెట్టువానితమ్ముఁడనుగా దగ్గఱనుంటిని." జ్యేష్ఠనైవతుకర్తవ్యం" అను శాస్త్ర నిర్ణయము చొప్పునే నేను పాటించి