పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుర్తించి నేను బెంగతో నెవ్వరికిని గానరాకుండ గుడిలోని కరిగి యక్కడ నొకమూలలో రక్షించు మని యాబిడ్డను గూర్చి భగవంతుని గూర్చి యేమేమో ద్యానింపఁ జొచ్చితిని. ఇంటికి మధ్యాహ్నపుఁ దిండికి రాలేదు. ఇంటిలో అలజడి కొంత తగ్గినది. రెండు మూఁడు విరేచనములయి బిడ్డ తేటగా నున్నది. అపాయభాయము తొలఁ గినది. అందఱును భోజనము చేసి నేను గానరాక పోవుట గుర్తించి వెదక సాగిరి. మిత్రులిండ్లలో నెక్కడను నేను గానరాలేదు. ప్రొద్దు గ్రుంకు వేళ కావచ్చినది. మా నాయన గారికి వెఱపు కల్గినది. వెదకఁ గా వెదకఁ గా తుదికి గుడిలో నక్కియున్ననన్ను గనుగొని బిడ్డ క్షేమ మెఱిఁగించి చాల దుఃఖించినన్నింటికిఁ గొని వచ్చిరి. పసితనము నాఁ టినుండియు వ్యాధికి మృతికి నేను తార్మారయి పోయెడి వాఁడను. ఏమియు తోచక చేయఁ గల్గినది లేక ఇంత నిలువలేక ఎవ్వరును గుర్తింపఁ జాల రని గుడిలో నొక మూల నక్కి నాఁ డు నేను దైవప్రార్ధనము చేసితినే కాని దానికి ఫలితముండు అని యానాఁ డు నే నేఱుఁగను.

మా నాయనగారు వైద్యవృత్తిలో రోగులకడ కటువుగా సొమ్ము పుచ్చుకొనుచుండిరి. ఒక సందర్బమున వ్యాధితుని యార్తికిఁజకితుఁ డ నయిన నేను మా నయనగారిని సొమ్ముకి నిర్బందింపక మం దీయఁ గోరితిని.' ముందు వ్యాధి కుదుర్చుఁడు. వాని చేత సోమ్మిపుడు లేదు. నెమ్మదిగా ఇయ్యఁ గలఁ డు. ఇయ్యక పోయినఁ బోనిండు. మికు పుణ్యము దక్కు' నంటిని. రెండు నిమిషము లాలోచించి ' నాయనా! ఈ కాఠి