పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెడిపోక పోయినను గుణము కల్గక పోవచ్చునని యారాట పడ సాగితిని. మద్రాసులో ఉన్న నాళ్ళవి. ఓరియంటల్ లైబ్రరీకి వెళ్ళి 'నఖము'గణములకై వెదకితిని. అక్కడ ఆయు ర్వేద వైద్యశాలలో పని చేయుచున్న మిత్రున కిది తెల్పితిని. 'నఖ' మనఁ గా చేతి గోరు కాదనీ, అది సుగంధద్రవ్యమనీ, నత్తగుల్ల వంటి జలజంతువుల గుల్లల మూతచిప్పయనీ యాధార్ధ్యమును గుర్తించితిని. వెంటనే రోగిని దానినెఱిఁగించి మంచి వైద్యము చేయించుకో గోరితిని. తర్వాత ఆపరేషన్ జరగెను. ఆతఁడు స్వాస్ధ్యము చెందెను.

అంతంరంగంమున విస్పష్టపరిజ్ఞానపుతీరు గోచరింపని వారు చేయు సాహసకార్యము లిట్టివి! ఎఱుక కందనియౌషధమును జాలినంత యెఱుక లేనివారు ప్రయోగించుట, ఏదో జరుగు చుండుటయుఁ గా వైద్య విధాన మున్నది. అంతరంగమును పీల్చుకొని యంత రాత్మాభిముఖముగా బయనించుచు సత్యజ్ఞానానందముల నంతలతల ననుభవింప నలవడిన వారి ప్రజ్ఞలే ప్రపంచోప కారకము లగుచుండును.

ఇంచుమించు నాపదియేండ్ల ప్రాయముననే నాకడ గొట్టు సోదరికిఁ జాల జబ్బు చేసినది. జీవితము నిలువ దేమోయని యందఱు సందేహించు స్థితి కలిగెను. తర్వాత స్థితి యెట్లుండునో యని మాకు చల్దియన్నము వడివడిగాఁ బెట్టిరి. మాతో వావిడిచి చెప్పకున్నను ఇంటిలోని యలజడిని