పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మక్కడి స్తూప శిలలు చుట్టుపట్టుల దేవాలయ నిర్మాణముల గంటసాల స్తూపపు సూచిశిల యొకటి మంగి యువరాజు శాసనశిలగా మారినది. క్రీ. శ. 6,7 శ తాబ్దములకే బౌహద్ద్ స్తూపములు గొన్ని యైనను విద్వంసము చెందిన వనదగును. మా యూరి శివలింగంము జనమేజయ సర్పయాగస్దానమందు అనంత, వాసుకి, తక్షక కర్కోటక, మహానాగ కుమారుల చేత సుప్రతిష్ఠిత దివ్యలింగ మని పదు మూఁడువ శతాబ్ది నాఁ టి శాసన మున్నది.

ఒక శివరాత్రి నాఁడు జగజ్జ్యోతి వెలిగించు వేళకుఁ జాల ముందుగానే నే నక్కడకు జేరితిని. కొన్ని మణుగుల నేతి కుండులో గొప్ప జ్యోతి వెలిగించిరి. నేను తిరిగి వచ్చుటలో గోపుర ద్వారమున జనసమ్మర్దములో నలిగి పోయి క్రింది పడితిని. మా మిద నుండి యే జనము నన్ను చింపరిగుడ్డను దొర్లించుకొనుచు నడచినట్లు నడవజొచ్చిరి. చచ్చితి నను కొంటిని. ఊపిరాడదు ఎట్లో నన్ను కాళ్ళతోనే దొర్లించుచు గోపుర ద్వారము వెలికిపో పడదన్నిరి. బయటకు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒంటరిపట్టుకు దొరలి చాలాసేపు విశ్రాంతి గోన్నపై చక్క బడతిని. నాటినుండి గుళ్ళు గోపురములు జాతరలు నాకు దూరమయినవి.

మఱొకప్పుడు మా చుట్టుపట్టుల యూళ్ళ నెల్ల ఒకానొక యలజడి రేగినది. అది యిట్టిది- ఒక నాఁ డుదయమున నుండి సాయంకాలము దాఁక ఊరివా రెల్లరు ఊరి వెలుపల వసించి అక్కడ వంటలు చేసికొని దేవతలకు నైవేద్యము