పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చీకటిలో నేను లేను అని తోచెడిది. బ్రతికి ఉన్నాను అను కొనెడివాడను. ధైర్యము తోచి మినుకు మినుకు మనుచు అణుమాత్రుడను ఉన్నాను- అని తోచెడిది. ఎంత తంటాలు పడినను ఇంతే. ఒకనాడు నాలో చర్చ. ఎందుకు పుట్టితిని? చచ్చితిని గనుక ఎందుకు చచ్చితిని? పుట్టితిని గనుక చచ్చితిని సరే- మరల పుట్టుకుండరాదా? పుట్టితిని సరే-చావా కుండ రాదా? తోచదు ఇట్టు మనోమాధ నము జరగగా చివరికి తేల్చు కొన్నాను. నా పుట్టుక నే నేఱుగును. అంతా చీకటే ఇప్పు డేదో నేను ఇట్టు మినుకు మినుకు మనుచున్నాను. ఇది ఆరిపోతే ఏ మవుతుందో తెలియలేదు. వెల్తు రెక్కడు న్నది? నే నున్నా నని మినుకు మినుకు మను అణుమా త్రపు వెల్తు రే యున్నది, ఇది ప్రజ్వరిల్ల రాదా? ఈ చింత హెచ్చయినది. జాతరల మిఁద రోత మఱీ హెచ్చినది.

ఆ కాలముననే అప్పటికి నాకు పదేండ్ల వయ సుండ నో, ఉండదో మాయుర శివరాత్రృత్సవము గొప్పగా సాగును, మా చుట్టుపట్టుల యుళ్ళు కెల్ల మాయూర గోప్పశివ క్షేత్రము. అక్కడ నాగేశ్వరస్వామి యని శివలింగ మున్నది. అమరావతివలె నదియు బ్రాచీన శివ క్షేత్రము ఎంత ప్రాచీన మయినను నది బౌద్ధమత వినాశ చిహ్నముగా వెలసినదే యని నా నమ్మకము. అక్కడ శివలింగ మొక బౌద్దస్తూపశిలయే యని యిటీవాలి నా నిశ్చయము. అక్కడి దేవాలయమున అర్ధ ధర్మచక్రము గల బౌద్ద స్తూప శిలలున్నవి. కంటకనేల (గంటసాల) స్తూప విధ్వంసనానంతర