పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసి భుజింపవలయును. ఇంటి వాకిటితలుపుల మిద శ్రీ వైష్ణవ నామ మంటించవలెను. మెడలో సొరకాయ పెంచిక కట్టుకో వలెను. అట్లు చేయకున్నచో మహానర్దము వచ్చును. ప్రతి యింటి వాకిటి తలుపులమిద నామములు వెలయించిరి. ఎక్కడివో యెండు సొరకాయ బిళ్లలు (అమ్మిరిగాబోలును) వచ్చినవి. జందెములకు, మెడహరములకు.మొలత్రాళ్ళకు నందఱు వానిని కట్టుకొనిరి. ఊరి వెలుపల వంటలకు పయన మగుచుండిరి. మా నాయనగా రిందుకు ప్రతికూలురు- ఊరి వెలుపల కందఱును వెళ్ళిన పిదప దొంగ లూరు దోచుకోగల రని. మునసబు కారణాలు దైవభీతితో నే జాగ్రత్త వహింతు మని మాట యిచ్చిరి. కొంద ఱెవ్వరైన నూరు విడువకున్నచో తర్వాత నేదేని యాదృచ్చిక ముగానే ఆయెను- గ్రామమున కీడు దాపరిల్లినచో దాని తాకిడి ఊరు విడువని వారి మిఁ ద పడగలదు. కాన మాఱుమాటాక యూరు విడిచి వెళ్ళవలసి నదే యని యందఱు తీర్మానించు కొనిరి. మేము మాత్రము యింట పులిహొర చేసికొని యది మూట గట్టుకొని ఊరి వెలుపలకు వెళ్ళి అక్కడ దేవతకు దాని నివేదించి భుజించి యింత మజ్జిగ త్రాగి యింటికి రాదగు ననుకొంటిమి. నన్నందుకై కరివేపాకు తెచ్చి పెట్టు మనిరి. ఊరిలోని వారందఱు నాహరసామగ్రులతో నూరి వెలుపలకు వెళ్లుచుండిరి. దొడ్డిలో కరివేప చెట్టు గల బ్రాహ్మణుల యింటికి వెళ్ళి కరివేపాకు నడిగితిని. వారు నూరి వెలిపలికి పయనమగుచుండిరి.' కరివేపా కీయ వీలు లేదు. మేము వెళ్లుచింటి' మనిరి. నేను