పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్నించెడి వారు. ఒరుల క్లేశము నపనయించుటకు చికిత్సకుఁడు వారితో నైక్యతను భావించని దే ఫలము కలుగ దని వ్రాసితిని. ఇట్టి యెడ ట్రీట్మేంటు అనేకముగా గన్పట్టుచు నేక మగుపదార్ధమును గురుతించుటలో నొక యాభ్యాసముగ పని చెయుచున్నది. మనలను మనము చూచికొనుట కేర్పడిన భ్రుక్తరహిత తారక రాజయోగ సాధనకు ట్రీట్మేంటు పద్ధతి సహాయకారియే యగుచున్నది.అవసరము కూడ నగుచున్నది.

   మఱియు- ఇతరుఁడు బాధపడుచుండఁ గా చూచి యోగి యూరకుండు టెట్లు?
   "ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున 
   సుఖం వా యది వా దుఃఖమ్ స యోగీ పరమో మతః"
                   భగవద్గీత VI .32.
   "ఓ యర్జునా! ఎవఁడు సుఖములోను దుఃఖములోను సర్వులను తనవలెనే చూచునో వాఁడు పరమయోగి" అను భగవద్గీతా ప్రబోధమును గూడజ్ఞాప్తికిఁ దెచ్చుకొందము గాక!
                                                        

భృక్తరహితతారక రాజయోగము

శ్రీ శాస్త్రిగారు ట్రీట్మేంటులో బాగు చేసిన వారితో ఆ బాగు చేయునది తాము కామనియు సర్వాంతర్యామి, సర్వద యామయుఁడు నగు ఈశ్వరుఁడే యనియు చెప్పెడివా రని వ్రాసితిని. వారి గురుదేవులే సాక్షాత్పర బ్రహ్మము! కాని వారి పేరైన ఎన్నడును ఉచ్చరించెడివారు కారు. కారణము- ఈ యోగమును గూర్చి ప్రచారము చేయవల దని సాధకులను వారి గురుదేవులు శాసించియుండు