పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దయఁజూపువానిని అది ద్వగునముగా వర్దిల్లఁజేయును" అని మహాకవి షేక్స్పియరు చెప్పినది అక్షరశః నిజము.

   "The quality of mercy is not strain'd;
   It droppeth as the gentle rain from heaven
   Upon the place beneath;it is ywice blest;
   It blesseth him that gives and him that takes:" 
           మరియు జీససు చెప్పినట్లు,
   "Blessed are the merciful:for they shall obtain mercy."__ Mathew, V, 7. 
   రెండు:___ ఈ యోగము ట్రీట్మేంటుకై యేర్పడ లేదను వారికి శ్రీ శాస్త్రిగారు ట్రీట్మేంటులే లేనిచో నిది యెవరికి కావలయును? అని సమాధానము చెప్పెడివారు. అభ్యాసకాలమున శరీరముణ జరుగుకొన్ని స్పందనముల కొఱకెవ్వరు దీని నాశ్రయింపరు అని పలికెడువారు. 
   ఇంతకు శ్రీ శాస్త్రిగారి సాధన వారి ప్రకృతి ననుసరించి విశిష్టమార్గ మవలంబించె నని తోఁచును. ఆత్మచింతన పదము కూడ సత్యదయోపకార సార్ధకముగానుండవలె నని వీరి నిశ్చయము. వీరి ఆత్మార్పణా విధానము జీమూతవాహనుని కధను, బౌద్ధజాతక కధలను స్మృతుకిఁ దెచ్చును.
   వీరి కడ ట్రీట్మేంటు పడయఁగోరి చేరిన వారు ఆరోగ్యమును బడసిన పిమ్మట తమ కారోగ్యమును ప్రసాదించిన దివ్యతత్త్వమును అన్వేషించెడివారు. మఱియు తమ బాధ నెపముగ వారు సర్వాంతర్యామి నెఱుకకు దెచ్చికొన ప్రయ