పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుక్షణము త్వన్మయతాహ్లాదము హేచ్చేడువిధమున

   క్షణక్షణము మన్మయమ్తె జ్వలియింపగదే దేవా!
   అహంకారం మమకారము లడగార్చి క్రమక్రమముగ 
   కరగజేసికొని నీలో కన్నాతండ్రి! గడతెర్చుము.
   నాచాటున డాగియె దోబూచులాడు చున్నావా?
   చూచితి నిక నే నెమఱ నీచాటున డాగేదను.
   వేను కడుగిడ నిక నాథా! వెఱపు జెంద నిక నాథా!
   కడతేఱెద నిక నాథా ! కల్యాణం బిక నాథా.
   ఆ నాటి నుండి శ్రీ శాస్త్రిగారు దేహమును విడు తుదిక్షణము వఱకు నేకదీక్షతో ననేక భయంకరజాడ్యము లను మాన్చిరి నిజాము గా ట్రీట్మెంటువలన నెట్టి యపకార మ్తెన జరిగియే యున్నచో వారు భౌతిక  కాయము నెన్నడో విడియుండవలసినది, క్షయ, జాలోదరము, ఉబ్బసము, మేనింజ్తేటిస్, గుండెజబ్బు, పాముకాటు మున్నగు ఉపద్రవముల నెన్నింటినో  వారు చక్కబరచిరి. ఈ యోగ చికిత్సావిధానమున వారికి పాతిక సంవత్సములకు మించిన యనుభావము గలదు. అందు వారే పరమ ప్రామాణికులు!
   విశేషించి వారిట్లు చెప్పేడువారు " పరుల యనా రోగ్యములను సవరించు నెడ మన యనారోగ్యములు కూడా తొలగును" అని ఇది మాలో పెక్కు రకు   అనుభవపూర్వకముగా విదితమ్తెన విషయము.
   "దయగుణము బలవంతముగా  తెచ్చి పెట్టుకోనునది గాదు, అది ఆకసమునుండి పుడమిప్తె పడు చల్లని జల్లువంటిది.