పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టయే! చరమదశవరకును శ్రీ శాస్త్రిగారీ నియమమును పాటించెడివారు. అంతియేగాక ఆ యొర వడినే తమ్ముగూర్చి గూడ ప్రచారము నిరోధించెడివారు శ్రీ శాస్త్రిగారు. అందు చేతనే లోకమున వారి కృషి తెలియఁ దగినంతగా తెలియఁ బడలేదు. వారి వలన ఉపకారము పొందిన వారిలో కొందఱును, వారి యాంతర్యము నెఱిఁగిన మిత్రులు కొందఱును పత్రికాముఖమున వెల్వరించిన దుఃఖపు వెల్లువ వలననే పలువురు మొదటి సారిగా వీరు యోగ సాధకులని తెలిసికొనిరి. ఎవఁడు లోకమును విడిన పిమ్మట లోకము వానిని కృతజ్ఞతతో స్మరించునో అట్టివాని పుట్టువు గదా ధన్యము!

   శ్రీ శాస్త్రిగా రావలంబించినది భృక్తరహిత తారక రాజయోగము. దీనిని 1910లో కుంభకోణముణ నొక మహాపురుషుఁడు స్ధాపించెను. వారి నామాక్షరములే ఈ యోగమునకు మూలమంత్రము. వారిని స్మరించి నస్కరించిన వారికి బ్రహ్మజ్ఞాన మిత్తు నని వారిప్రతిన. బ్రహ్మైక్య మును పడయవలసినది ఏదో సమాధిదశలోనో లేక దేహము విడచిన పిమ్మటనో గా దనియు, ఈ ప్రజ్ఞాతోనే ఈ లోకము ననే ఈ దేహముతోనే యనియు, వారి మతము. వీరు చెప్పిన వానిని బోలినకొన్ని విషయములు పూర్వ గ్రంధములం దుండవచ్చును. కాని వీరు ఏ గ్రంధము పైనను ఆధారపడి యీ యోగమును ఆరంభింప లేదు.అది కేవలము నూతన సృష్టి! వీరు సర్వస్వతంత్రులు! మిగుల మహిమాన్వితులు! వీరి నీ మండలి వారు సాక్షాత్పర బ్రహ్మముగా తలఁతురు.