పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారణము వారి అపారకరుణాస్వభావమే కాని ట్రీట్మెంటు చేయువారికి ఆయా రోగుల బాధలు శేరిరకముగా చాయా మాత్రము కల్గుటయు నిజమే. 1926 ప్రాంతములో శ్రీ శాస్త్రిగారు బాహాటముగా, నిత్యకృత్యముగా ట్రీట్మెంటు నవలంబించినపుడు పలువురు మిత్రు లీ కారణమును జూపి వారింపఁజూచిరట! ఆ నాఁటిధ్యానములో శ్రీ శాస్త్రిగారు తమ గురు దేవులతో నీరీతి విన్నవించిరట___ "నిజముగా పరులబాధ తొలంగి ఆ కారణమున నాకు బాధ కల్గినను సమ్మతింతును ఆ తోలంగించునది నేనుకాదు. నా వెనుక నీవే దాగియున్నావు. సర్వదయామయుడ వ్తెననీవు నావలన పరుల బాధలను తొలగించి నన్ను బాధలో ముంతు వని నేను వేరతునా? నీ వెనుక నేను దాగ నేరనా?" ఈ విషయమునే దెలుపుచు శ్రీ శాస్త్రిగారు రచించిన పద్యములు:

    స్వామి ఆంతరనిలయా స్వయం వ్యక్తమ్తె వెలయ
    నాయజ్ఞానావరణము నాశముఁ జేయు మహాత్మా
    నే నను నయదమాధమ నిర్వాహము తొలగించి
    నీలో నను గలపుకొని సెగడగదే పరమాత్మా.
    నాలో గల వని యెఱుగక నానా బాధల పడితిని
    త్రో వెఱిగీతి నిప్పటికి దుఃఖము తిలగెను దేవా,
    దేవర ణా కిదేహము దేవళ మ్తె వెలసినది
    చక్కగా నెలకోని విశ్వస్వామిత్వము నేఱపగదే!
    అద్దమువలే దేహం బిది యమలినముగ జేసికొని
    నిద్దపుని తేజము జగదుద్దిప్తము చేయగదే!