పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయు వారాపదలపాలగుదురు. రెండు ఈ యోగముట్రీట్మెంటులకై ఏర్పడ లేదు అని వీరి మతము ఈ విషయమ్తె శ్రీ శాస్త్రిగారివలన మేము తెలిసికొన్న దేమనంగా:

ఒకటి: ట్రేట్మెంటు పద్దతికి మూలసూత్రము పరులయార్తినిగూర్చి ఆపుకోలేని యనుతాపము, ఆ బాధ తనకే కల్గినదా యన్నంత వగపు. ఆ యనుతాపము ఆ బాధ తనకే కల్గినదా యన్నంత వగపు. ఆ యనుతాపమే బాదితుల యార్తిని దిర్చును, ట్రీట్మెంటు సలుపువాడు "ఏది! నాప్తె నీమత్రంము ప్రయోగింపు చూత" మను తీరున నుండ రాదు. అట్టిచో నేమియు జరుగదు.

ప్రధమమున శ్రీ శాస్త్రిగా రితరుల బాధనుగూర్చి తపించుటేగాని, అందువలన ప్రయోజన ముండుననిగాని, రోగ నివారణ జరిగినదని గాని గమనించ లేదు. కాని కొన్ని మారులు తివ్రానారోగ్యముచే బాధపడువారిని జూచి శ్రీ శాస్త్రిగారు దుఃఖితు లగుటయు, అతిశిఘ్రముగా వ్యాధి నివారింపబడుటయు గమనించి నిర్హేతుక జాయమానమగు అనుకంపమే సర్వరోగనివారక మని తెలిసికొనిరి.

మఱియు స్వపరభేదములను పాటించినచో ట్రీట్మెంటు పని చేయదు. మానవుల నందఱను నేకకుటుంబముగా జూచు సమత్వబుద్ధి యేర్పడినకొలది ఈ ట్రీట్మెంటు విధాన మద్భుతఫలితముల నిచ్చును. ఈ యోగము ననుసరించువారు పలువురున్నను ని ప్రత్యేకార్హత శ్రీ శాస్త్రిగారికే యబ్బుటకు