పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానవత పెరుగను పెరుగను తద్ హృదమున నుండి ప్రజ్ఞోద్బోధములు పెరుగఁగలవు.ఇప్పుడు పెంపొందుచున్న శాస్త్రము లన్నియు నట్టివే.

   మానవహృదయము నిర్దుష్టము కానంతవఱకు, మానవ వాక్కు సుపవిత్రము కానంతవఱకు, మానవ కార్యములు వినిర్మలములు కానంతవఱకు సృష్టిరహస్యము మానవత గుర్తున కంద నేరదు. ప్రయత్నములు సాగుచున్నవి. ఈనాడీ గ్రంధము లట్టిప్రయత్నమున పుట్టినవే.
   "విహాయ శాస్త్రజాలాని యత్సత్యంత దుపాస్యతామ్ 
     వేద శాస్త్రపురాణాని పదపాంసు మివ త్యజేత్" 
   అని చెప్పిన వారిట్టిభావము గలవారే. మి రీనాడీ గ్రంధాదులు వెంటాడుట సాగించితి రేని మిలోని ప్రజ్ఞోద్బోధములు కుంటువడును. ప్రజ్ఞోద్బోధముల వెంటాడుచు బాహ్య శాస్త్రాది  సాధనములను విడనాడ వలెను. కడకు ఆత్మానుభూతిలో నెలకొనుట యగును. మిరు చూడవలసినది యీ తాటాకుల నాడీ గాదు. శరీరము చైతన్యముతో ఆడుచున్న నాడి. ఈ తాటాకుల నిప్పటికిఁకఁ గట్టిపెట్టి ఇందు చూపు తత్పరతను యోగసాధనములమిఁద చూపుఁడు"అనిరి. 
   ఇట్లు జరిగిన కొన్నినాళ్ళకు ముఖ్యశిష్యుఁ డొకఁడు 'నాడిలో నేమి విశేషము లున్నవో చదివి చూడ ననేకలుత్సాహపడుచున్నారు. చదువ ననుగ్రహింప వేఁడఁగా శ్రీవారు "ఆ నాడి కొన్ని ముఖ్య విష